KKR News Mentor: ఐపీఎల్ కోసం జరుగుతున్నసన్నాహాల మధ్య కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ జట్టుకు మెంటర్ పాత్ర పోషిస్తున్న గౌతమ్ గంభీర్ ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. అయితే కేకేఆర్ మెంటర్ పాత్ర ఖాళీ అవ్వడంతో ఇన్ని రోజులు సరైన నాయకుడి కోసం వెతికారు. గంభీర్ తరహాలో జట్టును నడిపించడం అంత ఆషామాషీ కాదు. అందుకే కేకేఆర్ లేటైనా స్ట్రాంగ్ పర్సన్ నే నియమించాలని అనుకుంది. మొత్తానికి కేకేఆర్ యాజమాన్యం తన జట్టుకు మెంటర్ని సెలెక్ట్ చేసింది. (IPL 2025)
డ్వేన్ బ్రావో(Dwayne Bravo) కేకేఆర్ శిబిరంలో చేరాడు. బ్రావోని కేకేఆర్ మెంటర్ గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బ్రావో ఐపీఎల్ లో చెన్నైకి చివరిసారిగా ఆడాడు. 2022లోనే బ్రావో ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉండగా డ్వేన్ బ్రావో 21 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ ముగిసింది. తాజాగా అతను అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. గాయం కారణంగా బ్రావో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. అయితే ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే బ్రావోను మెంటార్‌గా నియమిస్తున్నట్లు కేకేఆర్ ప్రకటించింది.
డ్వేన్ బ్రావో ఐపీఎల్ కెరీర్ అద్భుతంగ సాగింది. అతను చాలా కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు. కెరీర్లో ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ లయన్స్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన తర్వాత గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో సహాయక సిబ్బందిగా చేరాడు. బ్రావో ఇప్పటి వరకు ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఆడలేదు. కానీ గమనించదగ్గ విషయం ఏమిటంటే అతను షారుక్ ఖాన్ యాజమాన్యంలోని కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌లో భాగమయ్యాడు. ఇప్పుడు మరోసారి షారుక్ టీమ్ తో జతకట్టేందుకు ఒకే చెప్పాడు. మరోవైపు కేకేఆర్ ఐపీఎల్ లో మూడుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. మరి బ్రావో నేతృత్వంలో వచ్చే ఏడాది ఐపీఎల్ లో కేకేఆర్ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.
Also Read: Manu Bhaker Pistol Price: మను భాకర్ పిస్టల్ విలువ ఎంత?