Sri Lanka Team for T20 WC: టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు లంక జట్టు ఇదే

ఆసియాకప్‌లో అండర్ డాగ్స్‌ బరిలోకి దిగిన టైటిల్ ఎగరేసుకుపోయిన శ్రీలంకపై టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు అంచనాలు పెరిగాయి.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 10:21 PM IST

ఆసియాకప్‌లో అండర్ డాగ్స్‌ బరిలోకి దిగిన టైటిల్ ఎగరేసుకుపోయిన శ్రీలంకపై టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు అంచనాలు పెరిగాయి. ఆసియాకప్‌లో విజేతగా నిలిచిన జట్టునే దాదాపుగా మెగా టోర్నీకి కూడా లంక క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన జట్టులో సంచలన మార్పులు ఏమీ చోటు చేసుకోలేదు. దసున్ శనక కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఆసియాకప్‌లో విఫలమైన చకిత్ అసలంక కూడా చోటు దక్కించుకున్నాడు. అయితే దుష్యంత్ చమీరా, లాహిరు కుమారా కూడా ఎంపికైనప్పటకీ.. ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంది. చమీరా చీలమండ గాయంతో బాధపడుతుండగా.. పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. అయితే లంక పేస్ విభాగం బలంగానే కనిపిస్తోంది. ఆసియాకప్‌లో లంక పేసర్లు నిలకడగా రాణించారు.
అయితే సీనియర్ ప్లేయర్ దినేశ్ చందిమాల్‌ స్టాండ్ బై జాబితాలో ఎంపికయ్యాడు. స్టాండ్ బై ప్లేయర్స్ జాబితాలో ఆశిన్ బండారా, జయవిక్రమ,చందిమాల్, బినుర ఫెర్నాండో, నువానిడు ఫెర్నాండో చోటు దక్కించుకున్నారు. దాదాపు ఆసియాకప్‌లో ఉన్న ఆటగాళ్ళే వరల్డ్‌కప్‌లోనూ ఆడనున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆసియాకప్‌లో లంక అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌పై ఓటమి తర్వాత అద్భుతంగా పుంజుకుని భారత్, పాకిస్థాన్‌లపై విజయాలు సాధించి టైటిల్ గెలుచుకుంది.

శ్రీలంక జట్టు ః
దసున్ శనక ( కెప్టెన్ ), గుణలతిక, నిస్సాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భనుక రాజపక్స, ధనుంజయ డిసిల్వా, హసరంగ, తీక్షణ, వాండెర్సీ, కరుణారతనే, చమీరా, లాహిరు కుమారా, దిల్షాన్ మధుశంక, ప్రమోద్ మధుశన