Site icon HashtagU Telugu

Zim Afro T10: జింబాబ్వే టీ10 లీగ్ విజేత డర్బన్

Zim Afro T10

New Web Story Copy 2023 07 31t000923.588

Zim Afro T10: క్రికెట్ నయా ఫార్మాట్ టీ10 లీగ్ ను పలు దేశాల్లో విస్తరించే ప్రణాళికలకు మంచి ఆరంభం లభించింది. జింబాబ్వే వేదికగా జరిగిన జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ టోర్నీ తొలి సీజన్ రసవత్తరంగా ముగిసింది. ఈ టైటిల్ ను డర్బన్ క్వాలాండర్స్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో జోబర్గ్ బఫెలోస్ పై విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం అభిమానులను ఉర్రూతలూగించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన జోబర్గ్ బఫెలోస్ 127 పరుగుల భారీస్కోర్ చేసింది. కెప్టెన్ మహ్మద్ హఫీజ్ 32, టామ్ బాంటన్ 36 పరుగులతో రాణించారు. ఛేజింగ్ లో దూకుడుగా ఆడిన డర్బన్ టీమ్ మరో 4 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్‌ తో పాటు కివీస్ స్టార్ ప్లేయర్ టిమ్ సివర్ట్ మెరుపు బ్యాటింగ్ తో జట్టును గెలిపించారు. హజ్రతుల్లా జజాయ్‌ కేవలం 22 బంతుల్లోనే 1 ఫోర్ 4 సిక్సర్లతో 43 , సివర్ట్ 30 పరుగులు చేశారు. తర్వాత అసిఫ్ అలీ, ఫ్లెచర్ కూడా మెరుపులు మెరిపించడంతో డర్బన్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. టోర్నీ ఆసాం‍తం అద్భుతంగా రాణించిన సీఫర్ట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు లభించింది.

ఈ టోర్నీలో భారత ఆటగాళ్ళు కూడా ఆకట్టుకున్నారు. హరారే హరికేన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారత మాజీ ఓపెనర్ రాబిన్ ఊతప్ప ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 88 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే ఎలిమినేటర్‌లో అద్బుత విజయం సాధించినప్పటికీ.. క్వాలిఫయర్‌-2లో ఓటమి పాలకావడంతో హరారే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. అలాగే యూసఫ్ పఠాన్ మెరుపులు కూడా ఆకట్టుకున్నాయి.

జోబర్గ్‌కు ప్రాతినిధ్యం వహించిన యూసుఫ్ పఠాన్ కేవలం 26 బంతుల్లోనే 80 పరుగులు సాధించాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ చెలరేగిన పఠాన్ కేవలం 14 బంతుల్లో 5 ఫఓర్లతో 25 రన్స్ చేశాడు.

Also Read: Sunday Holiday : ఆదివారం జంతువులకు కూడా సెలవు.. ఓ ఆవు కోసం.. ఎక్కడో తెలుసా?