Site icon HashtagU Telugu

RCB Thrashes SRH: దెబ్బకు దెబ్బ కొట్టిన ఆర్సీబీ…మళ్ళీ ఓడిన సన్ రైజర్స్

RCB green

RCB green

ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ సన్ రైజర్స్ పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో తొలి మ్యాచ్‌లో కేవలం 68 రన్స్‌కే ఆలౌటైన ఆర్సీబీ.. ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీకి తొలి బంతికే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి మరోసారి గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఈ సీజన్‌లో ఇలా ఔటవ్వడం అతనికిది మూడోసారి కాగా.. మొత్తంగా ఐపీఎల్‌లో ఆరోసారి. ఈ సమయంలో కెప్టెన్‌ డుప్లెసిస్, రజత్‌ పటీదార్‌ ఇన్నింగ్స్‌ను సన్‌రైజర్స్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 105 రన్స్ జోడించారు. పటిదార్ 48 రన్స్ కు ఔటయినా డిప్లేసిస్, మాక్స్ వెల్ ధాటిగా ఆడారు. చివరి ఓవర్లో దినేష్ కార్తీక్‌ సన్ రైజర్స్ కు చుక్కలు చూపించాడు. మూడు సిక్స్‌లు, ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్లో ఆర్సీబీకి 25 రన్స్‌ వచ్చాయి. దినేష్‌ కార్తీక్ కేవలం 8 బాల్స్‌లోనే 30 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. డుప్లెసిస్ 50 బాల్స్‌లో 73 రన్స్‌ చేసాడు. దీంతో బెంగళూరు. 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ తొలి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. విలియమ్సన్‌ , అభిషేక్‌ శర్మ డకౌట్ అయ్యారు.
తర్వాత రాహుల్ త్రిపాఠి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా ఆడి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఆర్సీబి స్పిన్నర్ హసరంగ వరుస ఓవర్లలో హైదరాబాద్ ను దెబ్బ తీసాడు. తన స్పిన్ మ్యాజిక్ కొనసాగిస్తూ అయిదు వికెట్లు పడగొట్టాడు. త్రిపాఠి ఔటయ్యాక
సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. చివరికి హైదరాబాద్ 125 పరుగులకు అలౌట్ అయింది. దీంతో బెంగుళూరు
67 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో బెంగుళూరు పాయింట్ల పట్టిక లో నాలుగో స్థానంలో నిలిచింది. అటు తమ నెట్ రన్ రేట్ కూడా బాగా మెరుగు పరుచుకుంది. మరోవైపు వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిన సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మిగిలిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది.