Drama At MCG: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో (Drama At MCG) జరుగుతున్న నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. టీమిండియా తరుపున సెంచరీతో కదం తొక్కిన నితీష్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. నితీష్ ధాటిగా ఆడటంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి 114 పరుగులు సాధించాడు. అటు మహ్మద్ సిరాజ్ నాటౌట్‌గా నిలిచాడు.
నాల్గవ రోజు ఆటలో డ్రామా చోటుచేసుకుంది. ప్యాట్ కమ్మిన్స్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కమిన్స్ డిఆర్ఎస్ కు వెళ్ళాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 119వ ఓవర్ చివరి బంతికి, సిరాజ్‌పై కమిన్స్ అప్పీల్ చేశాడు. ఈ సమయంలో ఫీల్డింగ్ అంపైర్ సమీక్షించి సిరాజ్ నాటౌట్‌గా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కానీ కమిన్స్ అతని నిర్ణయం పట్ల అసంతృప్తిగా కనిపించాడు. 119వ ఓవర్ చివరి బంతికి సిరాజ్ రెండో స్లిప్ వద్ద స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. అయితే సిరాజ్ ఔట్ అయ్యాడా లేదా అన్నది అంపైర్లు తేల్చలేకపోయారు. ఈ కారణంగా థర్డ్ అంపైర్ సహాయం తీసుకున్నారు. రీప్లేలలో బంతి బంప్ బాల్ అని కనిపించింది. అంటే (బ్యాట్‌ను తాకిన తర్వాత అది నేలను తాకింది). దాని కారణంగా వివాదం తలెత్తింది.
Also Read: Nitish Father Falls On Gavaskar Feet: సునీల్ గవాస్కర్ కాళ్ళు మొక్కిన నితీష్ కుటుంబం
పాట్ కమ్మిన్స్ డీఆర్ఎస్ తీసుకోవాలని కోరగా అది జరగదని ఆన్-ఫీల్డ్ అంపైర్ వారికి చెప్పాడు. ఈ సమయంలో ప్యాట్ కమిన్స్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ తన మాట వినకపోవడంతో కమిన్స్ నిరాశతో నిష్క్రమించాల్సి వచ్చింది. సిరాజ్ ఈ విధంగా అవుట్ కాకుండా తృటిలో తప్పించుకున్నాడు, అయితే రెండు బంతుల తర్వాత మిచెల్ స్టార్క్ చేతిలో నితీష్ రెడ్డి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 369 పరుగులకు పరిమితమైంది. అయితే అంపైర్ నిర్ణయం మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్ మరియు రవిశాస్త్రిని కూడా గందరగోళానికి గురి చేసింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉందని గిల్‌క్రిస్ట్ చెప్పాడు. ఇలాంటి ఘటనను ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. అంపైర్ తొందరపాటు నిర్ణయం.అంటూ పేర్కొన్నాడు.