Site icon HashtagU Telugu

Shubman Gill: మూడు రోజుల్లో తండ్రి కోరికను నెరవేర్చిన గిల్

ODI Team Captain

ODI Team Captain

హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ (Shubman Gill) కివీస్ పై విశ్వరూపం చూపించాడు. భారీ షాట్లతో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో గిల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతకుముందు శ్రీలంకపై సెంచరీ కూడా సాదించాడు. అయితే సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ గిల్ పై అతని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక పై గిల్ ఔటయిన తీరుతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.యువ క్రికెటర్‌ ఆటతీరు పట్ల అతడి తండ్రి లఖ్విందర్ గిల్ సంతృప్తిగా లేడు. 97 బంతుల్లో 116 పరుగులు చేసిన గిల్ భారీ స్కోరు చేసేలా కనిపించాడు. కానీ రజిత బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇది లఖ్విందర్‌కు నచ్చలేదు.గిల్ ఔటయ్యే సమయానికి ఇంకా 16 ఓవర్లకుపైగా ఆట మిగిలే ఉంది. శుభ్‌మన్ ఔట్ కాకుండా ఉండుంటే.. డబుల్ సెంచరీ నమోదు చేసేవాడనేది లఖ్విందర్ గిల్ అభిప్రాయం.

Also Read: Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్

సెంచరీ చేశాక కూడా.. డబుల్ సెంచరీ చేయడానికి సరిపడా సమయం మిగిలే ఉందనీ, అన్నిసార్లూ ఇలాంటి ఆరంభం లభించదన్నాడు. వీడు ఇంకెప్పుడు నేర్చుకుంటాడుని లంక తో మ్యాచ్ సమయంలో గిల్ ఇంట్లోనే ఉన్న క్రికెటర్ గురుకీరత్ మన్‌తో లఖ్విందర్ వ్యాఖ్యానించాడట. ఆదివారం సీనియర్ గిల్ ఇలా వ్యాఖ్యానించగా.. బుధవారం న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ చేసిన గిల్ తన తండ్రి కోరికను నెరవేర్చాడు. అందుకేనేమో గిల్ డబుల్ సెంచరీ చేశాక ఆ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా 23 ఏళ్లకే డబుల్ సెంచరీ నమోదు చేసిన యువ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గిల్ దూకుడుతో భారత్ 349 పరుగులు చేయగలిగింది. తర్వాత కివీస్ పోరాడినా చివర్లో భారత్ బౌలర్లు కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించారు.