Site icon HashtagU Telugu

CSK: చెన్నై ప్లే ఆఫ్ ఛాన్స్ సంగతేంటి ?

Csk Imresizer

Csk Imresizer

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్‌ చరిత్రలో తిరుగులేని జట్టుగా నిలిచిన చెన్నై జట్టు.. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది. ఇక ఈ మెగా టిటోర్నీలో భాగంగా సీఎస్‌కే ఏప్రిల్ 21న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో పోటీపడనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరిస్థితి చెన్నై సూపర్ కింగ్స్ తో పోల్చుకుంటే మరీ ఘోరంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

ఇక ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఐపీఎల్‌-2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందా అన్న ప్రశ్న అందరిలో నెలకొంది. అయితే ఐపీఎల్‌-2010లో కూడా వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓటమి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ … పడి లేచిన కెరటంలా వరుస విజయాలు సాధించి టైటిల్ విజేతగా నిలిచింది.. అయితే ఈ సారి కూడా అదే రిపీట్‌ అవుతుందని కొంత మంది అభిప్రాయపడుతుండగా… మరి కొంత మంది చెన్నై సూపర్ కింగ్స్ పని అయిపోయింది అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్‌లకు అర్హత సాధించాలంటే..ప్రతీ మ్యాచును ఫైనల్ మ్యాచ్ అనుకొనే ఆడాల్సి ఉంటుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఒక జట్టు ప్లే ఆఫ్ కు చేరాలంటే 14 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ఇక అన్ని జట్ల కంటే ముందు వసరుసలో ఉండాలి అంటే 16 పాయింట్లు సాదించాల్సి ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచుల్లో ఒకదాంట్లో మాత్రమే గెలిచి ప్రస్తుతం 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఈ సీజన్ లో ప్లే ఆప్స్ లోకి చేరాలంటే మరో 14 పాయింట్లు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇక మీదట ఆడబోయే 8 మ్యాచుల్లో 7 మ్యాచుల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. కానీ చెన్నై మరో ఓటమి చవిచూస్తే.. వారి ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.