IPL 2025: ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతారో మనకు తెలిసిందే. కానీ కొంతమంది బౌలర్ల ముందు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు కోసం ఇబ్బంది పడి ఔటైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఐపీఎల్‌ను బ్యాట్స్‌మెన్ ఆట అంటారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్ ఏదో ఒక రికార్డును సృష్టిస్తూనే ఉంటారు లేదా బద్దలు కొడుతూనే ఉంటారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టే బౌలర్లు ఉంటారు. ఈ కథనంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఐదుగురు బౌలర్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యుజ్వేంద్ర చాహల్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 160 మ్యాచ్‌ల్లో చాహల్ 205 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో చాహల్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. 18 వికెట్లు తీసుకున్నాడు. చాహల్ IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. మెగా వేలంలో పంజాబ్ రూ. 18 కోట్లు ఖర్చు చేసి చాహల్‌ను తమ జట్టులోకి చేర్చుకుంది.
పీయూష్ చావ్లా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పియూష్ చావ్లా రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ లీగ్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో పియూష్ ఒకడు. పియూష్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 192 మ్యాచ్‌లు ఆడాడు. 192 వికెట్లు కూడా తీసుకున్నాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో పియూష్ అమ్ముడుపోలేదు. అతని కోసం ఏ జట్టు కూడా బిడ్ చేయలేదు.
డ్వేన్ బ్రావో
IPL 2025లో KKR బౌలింగ్ కోచ్ పాత్ర పోషించనున్న డ్వేన్ బ్రావో.. ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. IPLలో 161 మ్యాచ్‌ల్లో బ్రావో 183 వికెట్లు పడగొట్టాడు. బ్రావో చాలా కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. అదే సమయంలో అతను ముంబై ఇండియన్స్ జట్టులో కూడా భాగమయ్యాడు.
భువనేశ్వర్ కుమార్
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సుల్తాన్ ఆఫ్ స్వింగ్‌గా పిలువబడే భువనేశ్వర్ కుమార్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 176 మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ మొత్తం 181 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో భువనేశ్వర్ రెండుసార్లు ఐదు వికెట్లు తీసిన ఘనతను కూడా సాధించాడు. భువనేశ్వర్ ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ తరపున బరిలోకి దిగనున్నాడు. ఆర్‌సీబీ రూ.10.75 కోట్లు ఖర్చు చేసి భువనేశ్వర్‌ను తన జట్టులోకి చేర్చుకుంది.
Also Read: Oral Cancer: నోటిలో పదే పదే ఈ సమస్య వస్తుందా? అయితే క్యాన్సర్ కావొచ్చు!
సునీల్ నరైన్
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీ నరైన్ IPLలో 180 వికెట్లు పడగొట్టాడు. ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో నరైన్ ఐదవ స్థానంలో ఉన్నాడు. IPL 2024లో నరైన్ తన బ్యాటింగ్, బౌలింగ్‌తో KKRను మూడవసారి ఛాంపియన్‌గా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అందుకే ఈసారి నరైన్‌ను కోల్‌కతా నిలుపుకుంది.