Virat kohli: కోహ్లీ కొత్త టాటూ వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసా..? చాలా పెద్ద కథే ఉందిగా..

ఈ మధ్య టాటూల ఫ్యాషన్ నడుస్తోంది. టాటూలు వేయించుకునేందుకు యువత క్రేజ్ చూపిస్తోంది.

  • Written By:
  • Publish Date - April 2, 2023 / 09:00 PM IST

Virat kohli: ఈ మధ్య టాటూల ఫ్యాషన్ నడుస్తోంది. టాటూలు వేయించుకునేందుకు యువత క్రేజ్ చూపిస్తోంది. దీంతో టాటూలకు క్రేజ్ పెరిగింది. ఈ జనరేషన్ టాటూల మోజులో పడుతుంది. శరీరంపై తమకు ఇష్టమైన టాటూలు వేయించుకుంటున్నారు. సామాన్య యువతే కాదు.. సెలబ్రెటీలు తమ శరీరంపై విభిన్నమైన టాటూలు వేయించుకుంటూ ఉంటారు. దీంతో టాటూలు కనిపించినప్పుడు వాటి గురించి చర్చ జరుగుతూ ఉంటుంది.

అయితే టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీకి కూడా టాటూలు అంటే చాలా ఇష్టం. కోహ్లీ శరీరంపై అనేక టాటూలు ఉంటాయి. ఇప్పటికే కోహ్లీ అనేక పచ్చబొట్లు వేయించుకున్నాడు. తాజాగా ఐపీఎల్ ప్రారంభం అవ్వడానికి ముందు కోహ్లీ మరో టాటూ వేయించుకున్నాడు. ఈ టాటూ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ టూటూ వెనుక అర్థం ఏంటని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. దీంతో కోహ్లీకి టాటూ వేసిన ప్రముఖ కళాకారుడు, ఏలియన్స్ టాటూ ఫౌండర్ సన్నీ భానుశాలి టాటూ గురించి పలు విషయాలు బయటపెట్టాడు.

ఏకత్వాన్ని, జీవిత నిర్మాణాన్న, కోహ్లీ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా కోహ్లీకి కొత్త టాటూ వేసినట్లు చెప్పారు. సృష్టి మూలాన్ని సూచించేలా, అన్ని విషయాల పరస్పర అనుసంధాన్ని సూచించేలా టాటూ ఉన్నట్లు చెప్పారు. ఉన్నతమైన వాటి మూలాలు తెలియజేసేలా టాటూ ఉంటుందని సన్నీ భానుశాలి చెప్పుకొచ్చాడు. కోహ్లీకి టాటూ బాగా నచ్చిందని, అది చూసి మురిసిపోయినట్లు తెలిపాడు. ఈ టాటూ చాలా ఇష్టంతో వేసినట్లు చెప్పాడు. టాటూ చాలా వచ్చిందని, రెండు రోజుల పాటు ఈ టాటూ వేసినట్లు చెప్పాడు.

తొలిరోజు ముంబైలో, ఆ తర్వాత బెంగళూరు వెళ్లి టాటూ వేసినట్లు చెప్పాడు. టాటూ వేసేందుకు ఎన్నో గంటల సమయం పట్టిందని, అయినా కోహ్లీ సహనంతో కూర్చున్నట్లు తెలిపాడు. ఈ టాటూ జీవితకాలం కోహ్లీతో ఉంటుదందని చెప్పుకొచ్చాడు. తన టాటూలంటే కోహ్లీకి చాలా ఇష్టమని, తన పనితనం నచ్చి కోహ్లీనే స్వయంగా స్టూడియోకు వచ్చినట్లు చెప్పాడు. కోహ్లీలో అసలు గర్వం ఉండదని, చాలా ఒదిగి ఉంటారని సన్నీ చెప్పాడు.