Kohli’s Fitness: కోహ్లీ ఫిట్ నెస్ సీక్రెట్ ఎంటో తెలుసా!

ప్రతిరోజూ జిమ్ లో గంటల తరబడి గడిపే విరాట్ కొహ్లీ..ఫిట్ నెస్ కు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతాకాదు.

  • Written By:
  • Updated On - March 25, 2023 / 11:06 AM IST

స్టార్ బ్యాట్స్ మెన్ కోహ్లీ బ్యాట్ పడితే పరుగుల వరద పారాల్సిందే. అయితే ఆయన పరుగు వెనుక కఠోర శ్రమ ఉంది. అంతకుమించి హెల్దీ డైట్ కూడా ఉంది. ఇటు ఫిట్ నెస్, అటు డైట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకపోవడం వల్లే కోహ్లీ సక్సెస్ అవుతున్నాడు. ఇంతకీ కోహ్లీ రోజువారి హెల్దీ డైట్, దినచర్య ఎలా ఉంటుందంటే.. కోహ్లీ ఉదయం పూట మూడు గుడ్లు తింటాడు. పెరుగు, పాల ఉత్పత్తులు, గోధుమ పిండి, చపాతీలుకు దూరంగా ఉంటాడు. దీని వల్ల అనవసర కొవ్వు, ఇతర కెలస్ట్రాల్ బాడీలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడతాడు. ఇకపోతే కార్బోహైడ్రేడ్లు తక్కువగా ఉండే వాటిని తీసుకుంటాడు.

ఇక మధ్యాహ్న భోజనం విషయంలో కూడా కోహ్లి ప్రత్యేక చొరవ తీసుకుంటాడు. మధ్యాహ్న భోజనంలో రైస్ తీసుకుంటాడు. కానీ వాటిలో బలమైన పోషకాలు ఉండేలా చూసుకుంటాడు. ప్రాసెసింగ్ చేసిన రైస్ మాత్రమే తిసుకుంటాడట. ఇందులో తక్కువ కార్బోహైడ్రేడ్లు ఉంటాయి. గ్లూటెన్ అసలే ఉండదు. రాత్రి పూట భోజనం మితంగా తీసుకుంటాడు. స్వీట్లు అయితే అసలు ముట్టుకోడు. బియ్యం మాత్రం ప్రత్యేకంగా తయారు చేయించుకుని తింటుంటాడు. అయితే ఇందుకోసం భారీగానే ఖర్చు పెడుతాడట కోహ్లీ.

ప్రతిరోజూ జిమ్ లో గంటల తరబడి గడిపే విరాట్ కొహ్లీ..ఫిట్ నెస్ కు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతాకాదు. లీటర్ 2వేల రూపాయల ఖరీదు చేసే మినిరల్ వాటర్ ను ఫ్రాన్స్ నుంచి తెప్పించుకొని మరీ విరాట్ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాడు. ఓ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్ లా విరాట్ రోజూ వెయిట్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు.

విరాట్ తన 13 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన సందర్భాలు చాలా తక్కువ. కేవలం మానసిక సమస్యలతో మాత్రమే విరాట్ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. 2021- 22 సంవత్సరంలో ఒక్కసారి కూడా గాయం బారిన పడి నేషనల్ క్రికెట్ అకాడమీ గడప తొక్కని ఏకైక క్రికెటర్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇక అతని 14 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఫిట్నెస్ లేమీ కారణంగా దూరమైన మ్యాచులు కేవలం నాలుగు మాత్రమే అంటూ ఇటీవల బీసీసీఐ తెలిపింది.