Novak Djokovic: జకోవిచ్ దే ఫ్రెంచ్ ఓపెన్… సెర్బియన్ స్టార్ సరికొత్త చరిత్ర

ఒకటి కాదు..రెండు కాదు.. మూడు కాదు..అక్షరాలా 23 గ్రాండ్ శ్లామ్ టైటిళ్ళు..వరల్డ్ టెన్నిస్ లో జకోవిచ్ సరికొత్త రికార్డు ఇది. అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు

Novak Djokovic: ఒకటి కాదు..రెండు కాదు.. మూడు కాదు..అక్షరాలా 23 గ్రాండ్ శ్లామ్ టైటిళ్ళు..వరల్డ్ టెన్నిస్ లో జకోవిచ్ సరికొత్త రికార్డు ఇది. అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు సెర్బియన్ టెన్నిస్ స్టార్. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నార్వే ప్లేయర్ రూడ్ పై విజయం సాధించి కెరీర్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫేవరెట్ గా బరిలోకి దిగిన జకోవిచ్ ఊహించినట్టుగానే ఫైనల్స్ లో ఆధిపత్యం కనబరిచాడు. కేవలం తొలి సెట్ లో మాత్రమే అతనికి రూడ్ పోటీ ఇవ్వగలిగాడు. మూడు సెట్లలోనే రూడ్ ను ఓడించిన జకోవిచ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ సెర్బియన్ టెన్నిస్ స్టార్ 7-6, 6-3, 7-5 స్కోర్ తో రూడ్ ను చిత్తు చేశాడు.

తొలి సెట్‌లో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. జొకో సర్వీస్‌లను బ్రేక్‌ చేస్తూ ఒక దశలో కాస్పర్‌ రూడ్‌ 3-0తో ఆధిక్యంలో కనిపించాడు. అయితే జొకోవిచ్‌ మళ్లీ ఫుంజుకొని రూడ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి మూడు పాయింట్లు సాధించాడు. దీంతో 6-6తో తొలి సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక కీలక టైబ్రేక్‌లో జొకోవిచ్‌ తన జోరు చూపించి విన్నర్స్‌ సంధించి 7-6(7-1)తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే తొలిసెట్‌లో పోటీ ఇచ్చిన రూడ్‌ ఒక్కసారి మాత్రమే జొకోవిచ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేయగలిగాడు. అదే సమయంలో జొకోవిచ్‌ మాత్రం నాలుగుసార్లు రూడ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి ఆధిక్యంలో నిలిచాడు. మూడో సెట్ లో 10వ గేమ్ వరకూ సర్వీస్ నిలుపుకున్న రూడ్ తర్వాత చేతులెత్తేశాడు. దీంతో సెర్బియన్ స్టార్ 7-5తో సెట్ తో పాటూ మ్యాచ్ నూ సొంతం చేసుకున్నాడు. జొకోవిచ్‌ ఖాతాలో ఇది మూడో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కాగా.. ఓవరాల్‌గా 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం. ఓపెన్‌ శకంలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన తొలి ఆటగాడిగా జొకోవిచ్‌ చరిత్రకెక్కాడు.

Read More: WTC Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ కైవసం..!