Site icon HashtagU Telugu

Djokovic: జకోవిచ్‌ దే ఆస్ట్రేలియన్ ఓపెన్… నాదల్ రికార్డు సమం

Djokovic Beats Nadal French Open

Djokovic Beats Nadal French Open

Djokovic: సెర్బియన్ టెన్నిస్ స్టార్ కమ్ బ్యాక్ అదిరింది. జకోవిచ్ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో గ్రీక్ ఆటగాడు స్టెఫనోస్ సిట్సిపస్‌పై 6-3,7-6(7/4),7-6(7/5) తేడాతో జకోవిచ్‌ విజయం సాధించాడు. జకోవిచ్‌ కెరీర్‌లో ఇది 10 ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌. ఓవరాల్‌గా జకోవిచ్‌ కెరీర్‌లో ఇది 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. తద్వారా అరుదైన ఘనతను జకోవిచ్‌ సాధించాడు. అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన నాధల్‌ రికార్డును జకోవిచ్‌ సమం చేశాడు. ఈ విజయంతో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ నూ తిరిగి సొంతం చేసుకున్నాడు.

జకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023లలో ఆస్ట్రేలియా ఓపెన్ లో విజేతగా నిలిచాడు.
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలిస్తే ఇప్పుడు ఆ రికార్డును జకో సమం చేశాడు. నోవాక్ తర్వాత
రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ఉన్నాడు. ప్రస్తుతం జకోవిచ్ ఫామ్ ను చూస్తే ఈ ఏడాది అతడు నాదల్ ను అధిగమించడం ఖాయంలా కనిపిస్తుంది.