Disney Star Viewership: ప్రపంచ కప్ మొదలై రెండు వారాలు పూర్తయినా ఇప్పటి వరకు నువ్వా నేనా అన్న రీతిలో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. భారత్ , పాక్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని ఆశించిన ఫాన్స్ కు నిరాశే మిగిలింది. ఏకపక్షంగా సాగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. అయితే వ్యూయర్ షిప్ (Disney Star Viewership)లో మాత్రం చిరకాల ప్రత్యర్థుల సమరం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. డిస్నీహాట్ స్టార్ క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. హైఓల్టేజ్ మ్యాచ్‌లో రికార్డు రియల్ టైమ్ వ్యూస్‌ను రాబట్టింది. ఈ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగినా గరిష్టంగా 3 కోట్ల 40 లక్షల వ్యూస్ వచ్చాయి.
ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసే సమయంలో ఈ రికార్డు నమోదు అయ్యింది. ఏ దశలోనూ వ్యూస్ 3 కోట్లకు తగ్గలేదు. వన్డే ప్రపంచకప్ ముందు శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్ 2023లోనూ భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గరిష్టంగా 2 కోట్ల 80 లక్షల రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అధిగమించింది.ఈ మ్యాచ్‌కు ముందు 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు గరిష్టంగా 2 కోట్ల 53 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది కూడా హాట్ స్టార్ రికార్డే.
Also Read: Shanaka Ruled Out: శ్రీలంక జట్టుకు బిగ్ షాక్.. గాయం కారణంగా కీలక ఆటగాడు దూరం..!
We’re now on WhatsApp. Click to Join.
జియో సినిమా దెబ్బకు హాట్ స్టార్ ఆసియాకప్‌తో పాటు ప్రపంచకప్ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది. దీంతో వ్యూయర్ షిప్ లో రికార్డు నమోదవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ లో భారత్ ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్ పై గెలుపుతో హ్యాట్రిక్ విజయం అందుకున్న భారత్ తర్వాతి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది.