Site icon HashtagU Telugu

Gavaskar Warning : కోహ్లీకి గవాస్కర్ వార్నింగ్..

Gavaskar Kohli

Gavaskar Kohli

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి అభిమానుల్ని నిరాశ పరిచాడు. అహ్మదాబాద్‌ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్‌ కోహ్లీ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అల్జారీ జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సరిగా అంచనా వేయలేక పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. కోహ్లీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇకపై ఇలా షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కోవడానికి కోహ్లీ అన్నిరకాలుగా సన్నద్ధం కావాలన్నాడు.. అంతకుముందు దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా సఫారీలు కోహ్లీని ఇలాగే ఔట్ చేశారని గవాస్కర్ అన్నాడు.తాజాగా ఓ కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ కోహ్లీ ప్రదర్శనపై స్పందిస్తూ షార్ట్ పిచ్ బంతులను కోహ్లీ వదిలేయకుండా హుక్‌ షాట్‌కు ప్రయత్నించడం బౌలర్లకు అవకాశంలా కనిపిస్తోందన్నాడు. విరాట్ కోహ్లీ లోపాన్ని గ్రహించిన బౌలర్లు షార్ట్ పిచ్‌ దాడి చేసే అవకాశాలు ఇకపై ఎక్కువగా ఉన్నాయనీ, కోహ్లీ ఇకనైనా తనను తాను మరింత మెరుగుపర్చుకోవాలి అని సునీల్ గవాస్కర్ సూచించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ కేవలం 8 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో వేగంగా అంటే 96 ఇన్నింగ్స్‌ల్లో 5000 పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2007లో సచిన్‌ ఇదే వెస్టిండీస్ దేశంపై సొంతగడ్డపై 5000 పరుగుల మైలరాయిని చేరుకున్నాడు. అయితే ఈ మైలురాయిని చేరుకునేందుకు సచిన్‌కు 121 ఇన్నింగ్స్‌ అవసరమయ్యాయి. ఇక భార‌త్‌-విండీస్ జ‌ట్ల మ‌ధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండో వ‌న్డే బుధ‌వారం జ‌ర‌గ‌నుంది.

Exit mobile version