Site icon HashtagU Telugu

IPL 2024 RCB vs GT : కోహ్లీ, డుప్లేసిస్ ధనాధన్ ..గుజరాత్ పై బెంగుళూరు విజయం

RCB Target In IPL Auction

RCB Target In IPL Auction

ఐపీఎల్ (IPL 2024) 17వ సెకండాఫ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) దుమ్ము రేపుతోంది. వరుస విజయాలతో అదరగొడుతోంది. తాజాగా సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ (RCB vs GT) ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో బెంగుళూరు స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి గుజ‌రాత్ టైటాన్స్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్‌ 19.3 ఓవ‌ర్ల‌లో 147 ప‌రుగులకు ఆలౌటైంది. అంచనాలు పెట్టుకున్న శుబ్‌మ‌న్ గిల్‌, వృద్దిమాన్ సాహాతో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయిసుదర్శన్ నిరాశ పరిచారు. దీంతో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడిన క్రమంలో షారూఖ్ ఖాన్ 37 , డేవిడ్ మిల్ల‌ర్ 30 రన్స్ తో గుజరాత్ ను ఆదుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తర్వాత రాహుల్ తెవాటియా 35 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, విజ‌య్ కుమార్‌, య‌శ్ ద‌యాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్‌, కరణ్ చెరో వికెట్ తీశారు. 148 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో బెంగుళూరు చెలరేగిపోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లేసిస్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 92 పరుగులు జోడించారు. డుప్లేసిస్ కేవలం 23 బంతుల్లో 10 ఫోర్లు , 3 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అయితే మిడిల్ ఓవర్స్ లో అనూహ్యంగా వికెట్లు కోల్పోవడం కాసేపు ఉత్కంఠ నెలకొంది.

బెంగుళూరు 25 రన్స్ తేడాతో 5 వికెట్లు చేజార్చుకుంది. విల్ జాక్స్ 1 , పటిదార్ 2 , మాక్స్ వెల్ 4 , గ్రీన్ 1 , కోహ్లీ 42 రన్స్ కి ఔట్ అయ్యారు. ఈ దశలో దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్ తో కలిసి జట్టును గెలిపించాడు. చివరికి బెంగుళూరు 13.4 టార్గెట్ అందుకుంది. ఈ విజయంతో బెంగుళూరు పాయింట్ల పట్టికలో ఏడో ప్లేస్ కు చేరింది.

Read Also : Poonam Kaur : బాలకృష్ణ అల్లుడి ఫై పూనమ్ కౌర్ ట్వీట్