Site icon HashtagU Telugu

Dinesh Karthik Apology: ధోనీ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన దినేష్ కార్తీక్ , డీకే తప్పేంటి?

Dinesh Karthik Apology

Dinesh Karthik Apology

Dinesh Karthik Apology: టీమిండియాలో వికెట్ కీపర్ గా, బెస్ట్ ఫినిషర్ గా రాణించిన దినేష్ కార్తీక్ అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత సీజన్లో ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పాడు. తాజాగా డీకే ఓ స్టేట్మెంట్ తో విమర్శల పాలయ్యాడు. దీంతో ధోనీ ఫ్యాన్స్ డీకే ని ఓ రేంజ్ లో ఏసుకున్నారు. ఈ మధ్య డీకే తన ఆల్ టైం ఫెవరెట్ జట్టు గురించి మాట్లాడుతూ ధోనీని లెక్కలోకి తీసుకోలేదు.

దినేష్ కార్తీక్ ప్రకటించిన ఫెవరెట్ జట్టులో రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా మరియు జహీర్ ఖాన్‌ల పేర్లను చెప్పాడు. అయితే దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మహేంద్ర సింగ్ ధోనీ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.దేంతో మాహీ ఫ్యాన్స్ డీకేపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు . సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. అయితే లెట్ గా గ్రహించిన డీకే ధోనీ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పాడు. నేను బిగ్ మిస్టేక్ చేశానని, అది అనుకోకుండా జరిగిందన్నాడు. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ తర్వాత ఈ విషయం అర్థమైందని అన్నాడు. ధోని పేరు ఏ ఫార్మాట్ లో అయినా ఉంటుంది. గ్రేట్ క్రికెటర్స్ లో మాహీ ఒకడు. ఆల్ టైమ్ ఎలెవన్ ను మళ్లీ ప్రకటించాల్సి వస్తే ఒక మార్పు చేస్తా. ధోనీని ఏడో స్థానంలో తీసుకుంటానని చెప్తూ జడేజా స్థానంలో ధోనీని చేర్చాడు. అంతేగాక ఎనీ టీమిండియా ఎలెవన్ అయినా అతడే కెప్టెన్ అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

డీకే క్లారిటీకి ధోనీ ఫ్యాన్స్ కూల్ అయ్యారు. అయితే డీకేని విమర్శించాలని వాళ్ళ ఉద్దేశం కాదని తెలుస్తుంది. ఎందుకంటే ఒక టీమిండియా మాజీ ప్లేయర్ మరో లెజెండరీ ప్లేయర్ని విస్మరించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్లో 90 టెస్టుల్లో 6 సెంచరీలతో 4876 పరుగులు చేశాడు, 350 వన్డేల్లో 10 సెంచరీలతో 10,773 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. ఇది కాకుండా టెస్ట్‌లో 256 క్యాచ్‌లు మరియు 38 స్టంప్‌లు, వన్డేలో 321 క్యాచ్‌లు మరియు 123 స్టంప్‌లు మరియు టి20లో 57 క్యాచ్‌లు మరియు 34 స్టంప్‌లు చేసి ఇండియన్స్ క్రికెట్లో తనకంటూ ఒక పేజీని ముద్రించుకున్నాడు.

Also Read: Paul Valthaty: చెన్నైపై భారీ సెంచరీ చేసి కనుమరుగైన స్టార్ బ్యాటర్ కోచ్ గా రీ ఎంట్రీ

Exit mobile version