Site icon HashtagU Telugu

IPL 2024: ఆర్సీబీ నుంచి దినేష్ కార్తీక్ అవుట్?

IPL 2024

New Web Story Copy (44)

IPL 2024: ఐపీఎల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్స్ అయినవారు ప్రస్తుతం టీమిండియాలో కొనసాగుతున్నారు. టీమిండియాలో ఆడుతూ ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన చేసి విమర్శలు మూటగట్టుకున్నవారు కూడా లేకపోలేదు. పొట్టి ఫార్మెట్లో ధనాధన్ ఆశిస్తారు. ఐపీఎల్ లో బ్యాటింగ్ లేదా బౌలింగ్ లో సత్తా చాటాలి లేకపోతే ఇంటికి పంపించేస్తారు. ప్రస్తుతం దినేష్ కార్తీక్ పరిస్థితి చివరిదశకు వచ్చినట్టు తెలుస్తుంది.

2022 ఐపీఎల్ సీజన్లో ప్రశంసలు అందుకున్న డీకే 2023 ఐపీఎల్ పేలవ ప్రదర్శనతో విమర్శలు నెత్తినేసుకున్నాడు. దినేష్ కార్తీక్ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 2022 ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కీలక సమయంలో ఆడి జట్టుకు తోడ్పడ్డాడు. కానీ ఐపీఎల్ సీజన్ 16లో దినేష్ కార్తీక్ అత్యంత చెత్తగా ఆడాడు. వరుసగా విఫలమవుతూ అభిమానుల చేత చీవాట్లు తిన్నాడు. దీనికి తోడు ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక డక్‌లు అయిన ఆటగాడిగా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో మొత్తం 17 సార్లు జీరోకే వెనుదిరగగా. గత సీజన్లో రెండు నాలుగు సార్లు డక్‌ అవుట్ అయ్యాడు. 2022 సీజన్‌లో 16 మ్యాచుల్లో 330 పరుగులు చేస్తే 2023 సీజన్‌లో 13 మ్యాచుల్లో 140 పరుగులు మాత్రమే చేశాడు. డెత్ ఓవర్లలోనూ చేతులెత్తియడం జట్టుకు మైనస్ గా మారుతుంది. దీంతో ఆర్‌సీబీ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దినేశ్ కార్తీక్‌ని వేలానికి విడుదల చేయాలని భావిస్తోందట.

Also Read: Hair Tips: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే?