WTC Final 2023: WTC ఫైనల్‌లో భారత ఓటమి ఖాయం: దినేష్ కార్తీక్

WTC Final 2023: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీకొంటోంది. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు టైటిల్ మ్యాచ్‌లో తడబడుతుంది. ఆస్ట్రేలియా ఆధిక్యం 400 దాటడంతో టీమిండియా ఓటమి ప్రమాదంలో పడింది. అయితే మ్యాచ్ ముగిసేలోపే దినేష్ కార్తీక్ భారత్ ఓటమిని డిక్లేర్ చేశాడు. WTC ఫైనల్‌లో భారత జట్టు గెలిచే అవకాశం లేదని దినేష్ కార్తీక్ ప్రెడిక్షన్ ఇచ్చేశాడు.

దినేష్ కార్తీక్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ… “భారత్‌కు డబ్ల్యుటిసి ఫైనల్‌లో గెలిచే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అభిమానులకు ఇది బాధాకరమైన సందేశమని నాకు తెలుసు. నేను ఆశను వదులుకోలేదు కానీ పిచ్ పై ఆడుతున్న తీరును బట్టి నా అంచనా చెప్తున్నాను అన్నాడు దినేష్ కార్తీక్.

ఇదిలా ఉండగా 18 నెలల తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన అజింక్య రహానే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో తన అద్భుత ఇన్నింగ్స్‌తో అక్కట్టుకున్నాడు. కంగారూ బౌలర్లను ఉతికారేశాడు. 89 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు రహానే. రహానే ఇన్నింగ్స్ కారణంగా ఫాలోఆన్‌ను కాపాడుకోవడంలో భారత జట్టు విజయం సాధించింది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా రహానే యొక్క చక్కటి ఇన్నింగ్స్‌కు అభిమానిగా మారాడు మరియు ఇది అత్యుత్తమ పునరాగమనమని అభివర్ణించాడు.

Read More: NBK 109 : బర్త్‌డే రోజు బాలయ్య సర్‌ప్రైజ్.. NBK 109 సినిమా ఓపెనింగ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?