Most Ducks IPL: దినేష్ కార్తీక్ చెత్త రికార్డ్.. అత్యధిక డకౌట్స్

ఐపీఎల్ 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్లేఆప్స్ ఫేస్ నడుస్తుంది. తాజాగా ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్, బెంగుళూరు హోరాహోరీగా పోటీ పడ్డాయి.

Most Ducks IPL: ఐపీఎల్ 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్లేఆప్స్ ఫేస్ నడుస్తుంది. తాజాగా ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్, బెంగుళూరు హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఈ పోరులో ఆర్సీబీ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో బెంగుళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ సీజన్ 16లో యువ ఆటగాళ్లు దుమ్ముదులుపుతుంటే సీనియర్లు మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. అదీ కాకుండా తమ ఖాతాలో అనవసరమైన రికార్డుల్ని నెలకొల్పి పరువు తీసుకుంటున్నారు. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ , బెంగుళూరు తలపడింది. ఈ పోరులో గుజరాత్ నెగ్గింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో దినేష్ కార్తీక్ డకౌట్ అయ్యాడు. ఈ సీజన్లో దినేష్ కార్తీక్ డకౌట్ అవ్వడం ఇది నాలుగవ సారి. దీంతో ఎక్కువగా డకౌట్లు అయిన ఆటగాళ్లలో దినేష్ చేరాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్‌లు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా దినేష్ కార్తీక్ నిలిచాడు. ఈ విషయంలో రోహిత్ శర్మను కూడా వెనక్కినెట్టాడు. .

నిజానికి దినేష్ కార్తీక్ అద్భుతమైన ప్రదర్శన కారణంగా 3 సంవత్సరాల తర్వాత టీమ్ ఇండియా జట్టులో స్థానం సంపాదించాడు.టీ20 ప్రపంచ కప్ 2022 కోసం భారత జట్టులో దినేష్ కార్తీక్ చోటు సంపాదించాడు.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక డకౌట్లు అయిన ఆటగాళ్లు:

దినేష్ కార్తీక్ – 17 సార్లు

రోహిత్ శర్మ – 16 సార్లు

సునీల్ నరైన్ – 15 సార్లు

మన్‌దీప్ సింగ్ – 15 సార్లు

గ్లెన్ మాక్స్‌వెల్ – 14 సార్లు

Read More: IPL Playoff: ప్లే ఆఫ్ లెక్కలివే.. ఏ జట్టుకు ఛాన్సుందంటే..?