Site icon HashtagU Telugu

IPL : అభిషేక్ శర్మకు పనిష్మెంట్

Digvesh Rathi Suspended

Digvesh Rathi Suspended

ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ (Digvesh Rathi ), సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అభిషేక్‌ అవుటైన తర్వాత దిగ్వేష్‌ అతని వైపు దురుసుగా మాట్లాడడం, వివాదాస్పద హావభావాలు చేయడం వల్ల ఉద్రిక్తత పెరిగింది. దీనిపై బీసీసీఐ (BCCI) స్పందించి, ఇద్దరి మీద చర్యలు తీసుకుంది.

Heavy Rains : నేడు ఏపీలో అతి భారీ వర్షాలు : వాతావరణ శాఖ

ఈ వివాదానికి సంబంధించి బీసీసీఐ దిగ్వేష్‌ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. గతంలో మూడు డీ మెరిట్ పాయింట్లు ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో మరో రెండు పాయింట్లు కలిపి మొత్తం ఐదు డీ మెరిట్ పాయింట్లు అయ్యాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఐదు పాయింట్లు పూర్తి అయితే ఆటగాడిని ఒక మ్యాచ్‌కు సస్పెండ్ చేయాలి. దాంతో మే 22న గుజరాత్‌తో జరగబోయే మ్యాచ్‌కు దిగ్వేష్ సింగ్‌ ఆటకు దూరంగా ఉండనున్నాడు. అదే సమయంలో అభిషేక్ శర్మపై కూడా చర్యలు తీసుకుంటూ, అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు.

దిగ్వేష్ సింగ్‌ చర్యలు గతంలో కూడా వివాదానికి దారి తీసిన ఘటనలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లలోనూ అతను ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. తాజాగా అభిషేక్ శర్మ అవుటైన తర్వాత అతని వైపు దురుసుగా చూశాడు, చేతులతో సైగలు చేశాడు. దీనికి అభిషేక్ శర్మ కూడా కౌంటర్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. అంపైర్లు, కెప్టెన్లు జోక్యం చేసుకున్నప్పటికీ వాగ్వాదం కాస్త తీవ్రంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో ఆటగాళ్లు తమ ప్రవర్తనపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది.