Olympics: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒలింపిక్స్‌లో ఆడటం కష్టమేనా..? కారణమిదేనా..?

క్రికెట్‌ను అధికారికంగా ఒలింపిక్స్‌ (Olympics)లో భాగం చేశారు. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం తెలిపింది.

  • Written By:
  • Updated On - October 17, 2023 / 07:08 AM IST

Olympics: క్రికెట్‌ను అధికారికంగా ఒలింపిక్స్‌ (Olympics)లో భాగం చేశారు. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం తెలిపింది. 143 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు మరోసారి ఒలింపిక్స్‌లో చోటు దక్కింది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో ఆడటం చాలా కష్టం కావొచ్చు. ఏజ్ కారణంగా లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఆడే క్రికెట్‌లో చాలా మంది స్టార్ ఇండియన్ క్రికెటర్లు భాగం కాలేరు. 2028 నాటికి చాలా మంది భారతీయ ఆటగాళ్ల వయస్సు దాదాపు ప్రతి క్రీడాకారుడు రిటైర్మెంట్‌కు చాలా దగ్గరగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత స్టార్ ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో ఆడటం కష్టమే.

ఒలింపిక్స్ 2028 నాటికి స్టార్ ఇండియన్ ప్లేయర్‌ల వయస్సు ఎంత ఉంటుంది..?

ప్రస్తుతం భారత కెప్టెన్ రోహిత్ శర్మ 36 సంవత్సరాల వయస్సు. 2028 ఒలింపిక్స్‌లో అతని వయస్సు 41 సంవత్సరాలు ఉంటుంది. ఈ పరిస్థితిలో రోహిత్ 41 సంవత్సరాలు వచ్చే వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు 34 ఏళ్లు కాగా 2028 ఒలింపిక్స్ నాటికి అతడి వయసు 39 ఏళ్లు కావడంతో కోహ్లీ ఆడే అవకాశాలు కూడా తక్కువ.

We’re now on WhatsApp. Click to Join.

సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం సూర్య వయస్సు 33 సంవత్సరాలు. ఒలింపిక్స్ 2028 సమయానికి 38 సంవత్సరాలు అవుతుంది. రవీంద్ర జడేజాకు ప్రస్తుతం 34 ఏళ్లు కాగా, 2028 ఒలింపిక్స్‌లో అతనికి 39 ఏళ్లు నిండుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఆడటం కూడా అంత సులువు కాదు. అయితే జట్టులో చాలా మంది యువ బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నారు. వారు ఒలింపిక్స్‌లో భారత్ తరుపున ఆడటం ఖాయం.

Also Read: World Cup : వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. లంకపై గెలిచిన కంగారూలు

ఒలింపిక్స్ 2028 వరకు ఇండియన్ ప్లేయర్‌ల వయస్సు

– రోహిత్ శర్మ – 41 సంవత్సరాలు
– విరాట్ కోహ్లీ – 39 సంవత్సరాలు
సూర్యకుమార్ యాదవ్ – 38 సంవత్సరాలు
శుభ్‌మన్ గిల్ – 28 సంవత్సరాలు
జస్ప్రీత్ బుమ్రా – 33 సంవత్సరాలు
హార్దిక్ పాండ్యా- 34 ఏళ్లు
కుల్దీప్ యాదవ్ – 32 సంవత్సరాలు
మహ్మద్ సిరాజ్ – 33 సంవత్సరాలు
తిలక్ వర్మ – 24 సంవత్సరాలు
రిషబ్ పంత్ – 30 ఏళ్లు
రవీంద్ర జడేజా – 39 సంవత్సరాలు