Site icon HashtagU Telugu

Shubman Gill-Sara: గిల్ పై సారా ట్వీట్.. కానీ ట్విస్ట్

Shubman Gill Sara

Shubman Gill Sara

Shubman Gill-Sara: శుభ్ మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెం.1 బ్యాటర్ గా నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను వెనక్కు నెట్టి గిల్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. దీంతో సచిన్ కుమార్తె సారా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఎప్పటినుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. గిల్ ఓ ఇంటర్వ్యూలో లవ్ ట్రాక్ నడుస్తుందని హింట్ ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో మీరు సారతో డేటింగ్ లో ఉన్నారా అని యాంకర్ అడగగా, మేబి ఆర్ మేబి నాట్ అంటూ గిల్ ఇచ్చిన ఆన్సర్ ఒక్కసారిగా సారా వైపుకు టర్న్ తీసుకుంది.తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో గిల్ నంబర్ 1 బ్యాటర్ గా నిలిచాడు. దీంతో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ట్విటర్ ఖాతా నుంచి శుభ్‌మన్‌ గిల్ కు అభినందనలు తెలిపిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టులో శుభ్‌మన్‌ గిల్ ఫొటోతో పాటు లవ్ ఎమోజీ యాడ్ చేసింది. దీంతో సారా, గిల్ పై వస్తున్న రూమర్లు నిజమేనని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎందుకంటే సారా టెండూల్కర్ పేరుతో బ్లుటిక్ ఉన్న అఫీసియల్ అకౌంట్ నుంచి ట్వీట్ వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ట్విటర్ ఖాతా సారా టెండూల్కర్ ది కాదు. ఆమె పేరుపై ఉన్న నకిలీ ఖాతా అని తెలుసుకొని నెటిజన్లు అవాక్కవుతున్నారు. గతంలో సచిన్ తెందుల్కర్ తన పిల్లల పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లని వెంటనే తొలగించాల్సిందిగా ట్విట్టర్‌ని కోరాడు. అర్జున్ తెందుల్కర్, సారా తెందుల్కర్ పేరుతో వందకి పైగా ఫేక్ ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయని, అవన్నీ తొలగించాల్సిందిగా సచిన్ ట్విట్టర్ కి ట్వీట్ చేశాడు. మరి సారా గిల్ ప్రేమ వ్యవహారం ఎప్పుడు అఫీషియల్ అవుతుందో చూడాలి.

Also Read: Health: నిరంతర ఆలోచనలతో ప్రమాదమే