FACT CHECK : ఆసియా గేమ్స్ లో జ్యోతికి గోల్డ్ వచ్చిందా ? అది నిజమేనా ?

FACT CHECK :  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ అథ్లెట్, ఏస్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీ కూడా చైనాలో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. 

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 04:16 PM IST

FACT CHECK :  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ అథ్లెట్, ఏస్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీ కూడా చైనాలో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు.  ఇండియా అథ్లెటిక్స్ టీమ్ తరఫున 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో ఆమె పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే ఆసియా గేమ్స్ లో జ్యోతి యర్రాజీ గోల్డ్ మెడల్ ను గెల్చుకున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు పుకార్లను ప్రచారం చేస్తున్నారు.  ప్రముఖ గాయని ఆశా భోంస్లే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లో ఈరోజు  ఉదయం  పోస్ట్ చేస్తూ..  ఆసియా గేమ్స్ 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో ఏపీకి చెందిన అథ్లెట్ జ్యోతికి స్వర్ణం వచ్చిందని ప్రస్తావించారు. ఆ పోస్ట్ కు ఒక వీడియోను కూడా జోడించారు. కానీ వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

Also read : Malkajgiri BRS Candidate : మల్కాజ్ గిరి బిఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎవర్ని దింపుతాడో..?

అదేమిటంటే.. 2023 ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ ఇంకా ప్రారంభమే కాలేదు. అది సెప్టెంబర్ 30న జరగబోతోంది. 2023 జూలైలో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజీకి గోల్డ్ మెడల్ వచ్చింది. దానికి సంబంధించిన వీడియోనే ఆశా భోంస్లే చేసిన ట్విట్టర్ పోస్ట్ లో జతపరిచారు. ఆ వీడియోను నిశితంగా పరిశీలించినట్లయితే.. చివర్లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లోగో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నిబట్టి అది ఫేక్ పోస్టు అని స్పష్టమైంది. సెప్టెంబర్ 30న మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ కు సంబంధించిన మొదటి రౌండ్ (FACT CHECK)  జరుగుతుంది. దాని ఫైనల్స్ అక్టోబర్ 1న జరుగుతాయి. ఈ పోటీల్లో మన తెలుగు ఆణిముత్యం జ్యోతి యర్రాజీకి విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.