Dhoni Silence: ధోని నిశ్శబ్దం ఎందుకంటే.. ధావన్ కామెంట్స్..

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక్కొక్కరిది ఒక్కో స్థానం. ఫార్మేట్ ఏదైనా తమదైన ప్రతిభను కనబరిచి క్రెకెట్లో రారాజుగా ఎదిగిన వారు ఎందరో.

  • Written By:
  • Publish Date - April 8, 2023 / 05:48 PM IST

Dhoni’s Silence : ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక్కొక్కరిది ఒక్కో స్థానం. ఫార్మేట్ ఏదైనా తమదైన ప్రతిభను కనబరిచి క్రెకెట్లో రారాజుగా ఎదిగిన వారు ఎందరో. కానీ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని స్థానం ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు మాహీ. అరంగేట్రం చేసిన అతికొద్ది రోజుల్లోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. టీమిండియాకు రెండు ప్రపంచ కప్ లను అందించి టీమిండియాని అగ్రస్థానంలో నిలిపాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచ కప్ లను అందించి చిరస్థాయిగా నిలిచాడు. అయితే ధోని (Dhoni) మైదానంలో ఎందుకంత కూల్ గా ఉంటాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మ్యాచ్ చేయి దాటిపోతున్న సమయంలోనూ ఏ మాత్రం నిరాశకు గురికాకుండా జట్టుని ముందుకు తీసుకెళ్తాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూ చాలా కూల్ గా కనిపిస్తాడు. అయితే తాజాగా ధోని నిశబ్దంపై గబ్బర్ స్పందించాడు. ధోని ఎందుకు కూల్ గా ఉంటాడో చెప్పాడు.

మిస్టర్ కూల్ ధోనిపై పంజాబ్ జట్టు సారథి శిఖర్ ధావన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధావన్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ధోని నిశబ్దంపై మీ స్పందన తెలపాలన్న జర్నలిస్ట్ కోరిక మేరకు ధావన్ ఆసక్తికరంగా స్పందించాడు. ధోని భాయ్ నిశ్శబ్దంతో విజయం సాధించాలని అనుకుంటాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తే ఆటగాళ్లు ఒత్తిడికి లోనవుతారు. ఆ విషయం ధోని భాయ్ కి బాగా తెలుసు. ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడిని ప్రదర్శించకుండా తన పని తాను చేసుకుంటూపోతాడు. మైదానంలో రిలాక్స్డ్ వాతావరణాన్ని తీసుకొచ్చి జట్టు సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపుతాడు. కామ్ గా కనిపించినప్పటికీ తన లెక్కలు తనకుంటాయి. అందుకే ధోని భాయ్ మైదానంలో నిశ్శబ్దంగా కనిపిస్తాడంటూ శిఖర్ ధావన్ తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఐపీయల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి సారధిగా ధోని వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు చెన్నై రెండు జట్లతో పోటీ పడగా.. ఒక మ్యాచ్ లో ఓటమి చెంది, ఒక విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక పంజాబ్ మాత్రం రెండు విజయాలతో ఫుల్ జోష్ లో కనిపిస్తుంది. అద్భుతమైన కెప్టెన్సీ కనబరుస్తున్నాడు ధావన్. ప్రత్యర్థులకు అన్ని విధాలుగా పోటీనిస్తూ జట్టును విజయం వైపు తీసుకెళ్తున్నాడు.

Also Read:  Bhumi Pednekar : హాట్ గ్రే డ్రెస్ లో యువతను ఆకర్షిస్తున్న భూమి పడ్నేకర్..!