Site icon HashtagU Telugu

DC Vs CSK: 16 బంతుల్లో 37 పరుగులు, ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Dc Vs Csk

Dc Vs Csk

DC Vs CSK: ఢిల్లీ క్యాపిటల్స్‌పై మహీ మ్యాజిక్ చేశాడు. విశాఖపట్నంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరింది. ధోనీ బ్యాటింగ్ చేస్తే చూడాలన్న అభిమానుల కోరికను తీర్చడమే కాకుండా ఫోర్లు, సిక్సర్లతో మైదానంలో హోరెత్తించాడు. శివమ్ దూబే ఔటైన తర్వాత ఎంఎస్ ధోని ఈ సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చి ప్రత్యర్థి బౌలర్లని ఉతికారేశాడు. బౌండరీలు సాధిస్తూనే, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇది చూస్తున్న అభిమానులు ఆనందంతో కేరింతలు పెట్టారు.

ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని చివరి ఓవర్‌లో 20 పరుగులు చేశాడు . దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నోర్కియా ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ముఖేష్ కుమార్ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న ధోని బంతిని బౌండరీ దాటించేశాడు. ఆ తర్వాత ధోనీ వెనుదిరిగి చూసుకోలేదు. చెన్నై ఇన్నింగ్స్ 16.6 ఓవర్లో ముఖేష్ వేసిన బంతికి ధోనీ మరో ఫోర్ కొట్టాడు. దీని తర్వాత అతను 17.5 ఓవర్లో ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని స్టాండ్స్ లోకి పంపించి సిక్సర్ల ఖాతా తెరిచాడు. ధోనీ కొట్టిన ఆ భారీ సిక్స్ కి ఖలీల్ ఒత్తిడికి లోనయ్యాడు. దాని ఫలితంగా ఖలీల్ తన ఓవర్లో రెండు వైడ్లు వేశాడు.

We’re now on WhatsAppClick to Join.

చెన్నై ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఎన్రిక్ నార్కియా బౌలింగ్ చేశాడు. జట్టు విజయానికి 41 పరుగులు చేయాల్సి ఉంది. ధోనీ మైదానంలో ఉన్నాడు. మొదటి బంతికి ఎక్స్‌ట్రా కవర్‌ ద్వారా ధోని ఫోర్‌ కొట్టాడు. రెండో బంతికి లో ఫుల్‌ టాస్‌ బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌పై సిక్సర్‌ గా మలిచాడు.ఓవర్ నాలుగో బంతికి లాంగ్ ఆన్ బౌండరీ దిశగా ఫోర్ కొట్టాడు.ఇన్నింగ్స్ చివరి బంతికి డీప్ పాయింట్ మీదుగా సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ ను పసందుగా మార్చేశాడు. నార్కియా ఓవర్‌లో 20 పరుగులు రావడంతో చెన్నై 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోనీ 16 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ లో మాహీ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో వైజాగ్ మైదానాన్ని హోరెత్తించాడు.

Also Read: MI vs RR Dream 11 Prediction: నేడు రాజస్థాన్‌ తో తాడోపెడో తేల్చుకోనున్న ముంబై ఇండియన్స్‌