Site icon HashtagU Telugu

MS Dhoni: తన జెర్సీ నెంబర్ వెనుక సీక్రెట్ చెప్పిన ధోనీ

79

79

భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోనీది ప్రత్యేకమైన స్థానం… మోస్ట్ సక్సెస్ పుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోనీ దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించిన ఏకైక కెప్టెన్. అంతేకాదు గ్రేటెస్ట్ ఫినిషర్ గా .. దిగ్గజ వికెట్‌ కీపర్‌గా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లికించుకున్నాడు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత అంతటి పాపులారిటీ సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

ఇక ప్రపంచ క్రికెట్ లో ధోని ధరించే నెంబర్‌ 7 జెర్సీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్క క్రికెట్‌లోనే కాదు.. ఫుట్‌బాల్‌లోనూ నెంబర్‌ 7 జెర్సీకి వేరే లెవెల్‌ క్రేజ్‌ ఉంది. ఫుట్‌బాల్‌ దిగ్గజాలుగా పేరు పొందిన క్రిస్టియానో రొనాల్డో కూడా ఇదే నెంబర్ జెర్సీతో బరిలోకి దిగుతుంటాడు. క్రికెట్ లో ఏడో నెంబర్‌ జెర్సీకి ధోనికి అవినాభావ సంబంధం ఉందని అభిమానులు భావిస్తుంటారు. ఈ కారణంగానే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఏడో నెంబర్ జెర్సీని బీసీసీఐ ఎవరికీ కేటాయించలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ ధోని తాను జెర్సీ నెం.7 ధరించడం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. తన అభిమానులందరూ ఏడో నెంబర్ తనకు అదృష్ట సంఖ్య అనుకుంటారనీ, అయితే అదేం కాదని చెప్పాడు. తన బర్త్ డే ఏడో నెలలో ఏడో తేదీన ఉండడంతోనే ఈ నెంబర్ నచ్చి జెర్సీపై ధరించినట్టు చెప్పుకొచ్చాడు. అలాగే తాను పుట్టిన ఏడాది ఆఖరి రెండు అంకెల్ని తీసివేస్తే 7 వస్తుందనీ, అందుకే తనకు 7వ నంబర్ కలిసివచ్చిందని అనుకుంటున్నట్టు అసలు విషయం వెల్లడించారు.

ఒక విధంగా తన కెరీర్‌లో7వ నెంబర్ జెర్సీకి మంచి ప్రాధాన్యతే ఉందని ధోనీచెప్పుకొచ్చాడు.2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. 350 వన్డేల్లో 10773 పరుగులు, 90 టెస్టుల్లో 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగుల సాధించాడు. ఇందులో వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలు ఉన్నాయి. జట్టులోకి వచ్చిన తక్కువ కాలంలోనే సారథిగా బాధ్యతలు తీసుకున్న మహీ భారత్ కు 2007లో తొలి టీ ట్వంటీ ప్రపంచకప్ అందించాడు. అలాే 2011 వన్డే వరల్డ్ కప్ తో పాటు టెస్టుల్లోనూ టీమిండియాను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఆ జట్టుకు 4 టైటిళ్లు అందించాడు.

Exit mobile version