Site icon HashtagU Telugu

MS Dhoni : వైరల్ అవుతోన్న ధోని మ్యూజికల్ షర్ట్ లుక్.. ధర వింటే షాక్ అవుతారు.!

Ms Dhoni

Ms Dhoni

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, మాహి ఫ్యాన్స్‌కు అభిమానానికి మరో రీజన్ వచ్చేసింది. మైదానంలో ముద్దు పేరు “కూల్ కెప్టెన్”గా పేరొందిన ఎంఎస్ ధోని ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆయన ధరించిన ఓ ప్రత్యేకమైన మ్యూజికల్ ప్రింట్ షర్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ధోని వేసుకున్న ఈ షర్ట్‌పై పియానో చిత్రణలు, మ్యూజిక్ నోట్స్ ముద్రించబడి ఉండడం అభిమానుల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. షర్ట్ డిజైన్ భుజం నుండి ఛాతీ వరకూ పియానో కీలను ప్రింట్ చేసి ప్రత్యేక శైలిలో రూపొందించారు. నేవీ బ్లూ రంగులో హాఫ్ స్లీవ్ డిజైన్ ఉన్న ఈ చొక్కా కచ్చితంగా సంగీతాభిమానులకే కాదు, ఫ్యాషన్ ప్రేమికులకూ నచ్చేలా ఉంది.

అయితే ఆశ్చర్యకర విషయమేమిటంటే.. ఈ చొక్కా ధర. ఈ లగ్జరీ డిజైనర్ షర్ట్ ప్రముఖ అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్ అమిరి (AMIRI) నుండి వచ్చింది. దీని ధర ఏకంగా $865, అంటే సుమారు రూ.72,000! సోషల్ మీడియాలో వాడుకదారులు “ఈ ధరలో ఐఫోన్ 15 ప్లస్ కొనొచ్చు!” అంటూ స్పందిస్తున్నారు. అది నిజమే.. ఒక ఫోన్ ధరలో ఒక చొక్కా ధరిస్తూ ధోని తన క్లాస్‌ను మరోసారి చాటేశారు.

ఈ లుక్‌లో ధోని జార్ఖండ్ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన ఇటీవల జార్ఖండ్ పర్యాటక, కళా సంస్కృతి, క్రీడలు , యువజన వ్యవహారాల శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. మంత్రి సుదివ్య కుమార్ సోనుతో కలిసి జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) స్టేడియంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ధరించిన ఫ్యాషన్ లుక్ అందరి చూపులను ఆకర్షించింది.

ధోని ఫ్యాషన్ ఎంపికలపై గతంలోనూ అభిమానులు ప్రశంసలు కురిపించగా, ఈసారి ఆయన మ్యూజికల్ షర్ట్ లుక్ విశేషంగా ట్రెండ్ అవుతోంది. క్రికెట్ మైదానంలో ఆటతోనే కాదు, తన స్టైల్‌తోనూ ధోని ఫ్యాన్స్‌ను మెప్పిస్తున్నారు.

AP Space Policy : ఏపీ స్పేస్‌ పాలసీ 4.0 జీవో విడుదల..

Exit mobile version