Site icon HashtagU Telugu

Dhoni- Kohli : MS ధోనితో స్నేహంపై విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్!

Dhoni& Kohli

Dhoni Kohli

Dhoni – Kohli : భారత క్రికెట్ జట్టులో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు – విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ. వీరిద్దరి  స్నేహం (Friendship)  అభిమానులకు, తోటి ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుంది. అయితే మైదానంలో కోహ్లీ, ధోనీల స్వభావం, శైలి ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కోహ్లి దూకుడుగా, ఎనర్జిటిక్‌గా ఉండేవాడు. మాజీ కెప్టెన్ ధోనీ మాత్రం ఒత్తిడిలో కూడా చాలా కూల్ గా ఉంటాడు. అయితే భారత మాజీ కెప్టెన్ కోహ్లీ ధోనీతో తనకున్న స్నేహం గురించి తరచూ మాట్లాడుతుంటాడు. టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని మాత్రమే తనకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడని కోహ్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ధోనీతో తన రిలేషన్ గురించి Dhoni – Kohli

కోహ్లి మరోసారి ధోనీతో తన రిలేషన్ గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నా కెరీర్‌లో భిన్నమైన దశను అనుభవిస్తున్నా అని అన్నాడు.  భారతదేశపు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన కోహ్లీ తన కెరీర్‌లో ఊహించని రికార్డులు నమోదు చేశాడు. అయితే ఒకొనొక సమయంలో క్రికెట్ కెరీర్ అనుకున్న సాఫీగా జరగలేదు. 2019 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. టెస్టు క్రికెట్‌లో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించినా, కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా కోహ్లీ గెలవలేకపోయాడు. ఆ కష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి ధోనీ అని కోహ్లీ చెప్పాడు. “ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నా వైఫ్ అనుష్క కాకుండా ధోని సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. క్లిష్ట సమయంలో  నిజంగా నన్ను సంప్రదించిన ఏకైక వ్యక్తి ధోని మాత్రమే అని కోహ్లీ చెప్పాడు.

ధోనీ మాటలు నా మనసును తాకాయి

ధోని మాటలు నా మనసును తాకాయి. ఎందుకంటే నేను ఎప్పుడూ చాలా ఆత్మవిశ్వాసంతో, మానసికంగా చాలా దృఢంగా ఉన్నవాడిగా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలవాడిగా చూడగలిగాను. మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో కొన్ని అడుగులు వెనక్కి వేయాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే బలంగా పోరాడాలి అనే కోరిక ధోని వల్ల నాలో మొదలైంది అని కోహ్లీ అన్నాడు.

Exit mobile version