Site icon HashtagU Telugu

Dhoni @ Marmo Gina Chepauk Stadium: ధోనీ.. ధోనీ.. మార్మోగిన చెపాక్ స్టేడియం

Dhoni.. Marmo Gina Chepauk Stadium

Dhoni.. Marmo Gina Chepauk Stadium

Dhoni @ Marmo Gina Chepauk Stadium : సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు స్టేడియం అభిమానులతో నిండిపోతుంది.. టెస్టులకు నామమాత్రంగా ఫ్యాన్స్ వచ్చినా.. వన్డే, టీ ట్వంటీలకు స్టేడియం ఫుల్ అయిపోతుంది. అయితే ఆటగాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా స్టేడియం కిక్కిరిసిపోయిందంటే అక్కడ సమ్ థింగ్ స్పెషల్ క్రేజ్ ఉండి ఉండాలి. ఆ క్రేజ్ పేరే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఐపీఎల్ 16వ సీజన్ కోసం చెన్నై జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. తాజాగా చెన్నై ప్రాక్టీస్ చూసేందుకు అభిమానులను అనుమతించారు. ఈ సందర్భంగా ధోనీ (Dhoni) బ్యాటింగ్ ప్రాక్టీస్ కు వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లింది. ధోనీ.. ధోనీ.. అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది.

ధోనీకి చెన్నై జట్టుతోనూ, అక్కడి అభిమానులతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐపీఎల్ ఆరంభం నుంచీ మహి చెన్నైకే ఆడుతున్నాడు. రాంఛీకి చెందిన వాడైనప్పటకీ.. ఐపీఎల్ వరకూ ధోనీ హౌం టౌన్ చెన్నైనే. ఎందుకంటే అతనిపై అక్కడి వారి అభిమానం ఆ రేంజ్ లో ఉంటుంది. అందుకే ప్రాక్టీస్ కు వస్తున్నప్పుడు కూడా ఐపీఎల్ మ్యాచ్ లో ధోనీ క్రీజులో అడుగుపెడుతున్నప్పుడు ఉండే జోష్ కనిపించింది. ఈ వీడియోను చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో గ్లోవ్స్ ధ‌రిస్తూ బ్యాట్ ప‌ట్టుకొని స్టైలిష్‌గా ధోనీ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కేజీఎఫ్‌ స్టైల్‌లో ధోనీ ఎంట్రీ అదిరిపోయిందంటూ నెజిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా గత సీజన్ లో అంచనాలకు అందుకోలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్ వేలం తర్వాత బలంగానే కనిపిస్తోంది. ఈ సీజన్ తో ఆటగాడిగా ధోనీ కెరీర్ ముగుస్తుందన్న వార్తల నేపథ్యంలో చెన్నై జట్టు టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read:  Rohit Sharma: క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లు డెలివరీ.. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా?