Site icon HashtagU Telugu

Dhoni: ధోనీ ధనాధన్ మెరుపులు.. కానీ CSK తప్పిదం

Dhoni Dhanadhan Shines.. But Csk's Mistake

Dhoni Dhanadhan Shines.. But Csk's Mistake

ఐపీఎల్ సీజన్16 రసవత్తరంగా సాగుతుంది. దాదాపు అన్ని మ్యాచులు చివరి వరకు ఉత్కంఠభరితంగానే సాగుతున్నాయి. చివరి బంతి వరకు ప్రేక్షకులకు పసందైన ప్రదర్శనతో కనువిందు చేస్తున్నారు ఆటగాళ్లు. నిన్న బుధవారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచులో చెన్నైపై రాజస్థాన్ మూడు పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ముందు వరుసలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా.. చెన్నై 172 పరుగులు చేసి మూడు పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అయితే చెన్నై ఓడినప్పటికీ ధోనీ (Dhoni) మెరుపు ఇన్నింగ్స్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. 40 ఏళ్ళు పైబడిన ధోనీ కుర్ర ఆటగాళ్లకు చమటలు పట్టించాడు. 17 బంతుల్లో 32 పరుగులతో మైదానంలో చెలరేగిపోయాడు. ఒక ఫోర్ , మూడు సిక్సర్లతో ధోనీ ధనాధన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ సీజన్లో వరుసగా రెండు విజయాలు సాధించిన చెన్నై హ్యాట్రిక్ పై కన్నేసింది. కానీ చెన్నై మిడిల్ ఆర్డర్ పేలవ ప్రదర్శనతో ఓటమి చెందింది. మ్యాచ్ అనంతరం ధోనీ (Dhoni) తన జట్టు చేసిన మిస్టేక్స్ ఏంటో తెలిపాడు. మిడిల్ ఓవర్లో స్ట్రైక్ రొటేట్ చేయడంలో బ్యాట్స్ మేన్స్ విఫలమయ్యారు. మిడిల్ ఆటగాళ్లు స్ట్రైక్ రొటేట్ చేసి ఉంటె ఫలితం మరోలా ఉండేదన్నారు ధోనీ. నిజానికి రాజస్థాన్ రాయల్స్ జట్టులో స్పిన్నర్ల కొరత కనిపించింది. పెద్దగా అనుభవం లేని స్పిన్నర్లు ఉన్నారు. రాజస్థాన్ జట్టు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమి కాదు. అయితే లక్ష్యానికి సమీపంగా చేరుకోవడం సంతోషాన్నిచ్చింది. రన్ రేట్ కాపాడుకోవడంలో మేము విజయం సాధించాము. టోర్నీ చివరిలో రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మా బౌలర్లు ఆకట్టుకున్నారంటూ ప్రశంసించారు.

గత రాత్రి మ్యాచులో రాజస్థాన్ తరఫున జోస్ బట్లర్ 52, దేవదత్ పడిక్కల్ 38 పరుగులు చేశారు. అశ్విన్, హెట్మెయర్ 30-30 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్ పాండే తలో రెండు వికెట్లు తీశారు. మొయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది. అదే సమయంలో చెన్నై తరఫున డెవాన్ కాన్వే 50, మహేంద్ర సింగ్ ధోనీ 32, అజింక్యా రహానే 31, జడేజా 25 పరుగులు చేశారు. రాజస్థాన్ తరఫున అశ్విన్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు. జంపా, సందీప్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.

Also Read:  Dhoni’s Production: ఎంఎస్. ధోని నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఇదే!