Site icon HashtagU Telugu

Dinesh Karthik: ధోనీ సిక్స్ కొడితే ఆర్సీబీ గెల‌వ‌టం ఏమిటి..? దినేష్ కార్తీక్ ఏం చెప్పాడంటే..!

Dinesh Karthik

Dinesh Karthik

Dinesh Karthik: IPL 2024లో శనివారం రాత్రి M చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో RCB అర్హత సాధించాలంటే 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండగా.. RCB 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత MS ధోని గురించి RCB వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) ఒక ప్రకటన ఇచ్చాడు.

RCB స్టార్ ఆట‌గాడు దినేష్ కార్తీక్ మ్యాచ్ గెలిచిన తర్వాత MS ధోని గురించి మాట్లాడుతూ.. ఈ రోజు MS ధోని ఒక సిక్స్ కొట్టాడు. బంతి స్టేడియం నుండి బ‌య‌ట‌ప‌డింది. ఇది మాకు చాలా లాభపడింది. ఎందుకంటే ఆ బంతి పోయాక కొత్త బంతి మా చేతుల్లోకి వ‌చ్చింది. కొత్త బాల్‌తో మా బౌలర్ల బౌలింగ్ మెరుగైందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ప్రారంభంలో వర్షం కురిసిందని, ఆ కారణంగా మైదానంలో మంచు కురిసిందని, బౌలర్ల చేతుల్లోంచి బంతి జారిపోయిందని మ‌న‌కు తెలిసిందే. కానీ ధోని స్టేడియం అవ‌త‌ల‌కి సిక్సర్ కొట్టాడు. దాని కారణంగా RCBకి కొత్త బంతి వచ్చింది.

Also Read: Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’లో కమల్ హాసన్ పాత్ర.. ఎంతసేపు కనిపించబోతుందో తెలుసా..?

ఐపీఎల్ 2024లో దినేష్ కార్తీక్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 39.38 సగటుతో 315 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను రెండు అర్ధ సెంచరీలు కూడా చేశాడు. కార్తీక్‌ స్ట్రైక్-రేట్ 195.65. ఈ ఐపీఎల్‌లో అతని అత్యుత్తమ స్కోరు 83 పరుగులు. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో కార్తీక్ అద్భుత ప్రదర్శన చేశాడు.

We’re now on WhatsApp : Click to Join

శ‌నివారం రాత్రి బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. జట్టులో విరాట్ కోహ్లీ 47 పరుగులు, ఫాఫ్ డుప్లెసిస్ 54 పరుగులు చేశారు. దీనికి బ‌దులుగా CSK తరపున రచిన్ రవీంద్ర 61 పరుగులు, రహానే 33 పరుగులు, రవీంద్ర జడేజా 42 అజేయంగా పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. క్వాలిఫై కావడానికి CSK 201 పరుగులు చేయాల్సి ఉండగా.. RCB వారిని 191 పరుగులకే పరిమితం చేసింది. దీంతో ఆర్సీబీ జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించింది.