Site icon HashtagU Telugu

PBKS vs LSG: ఆ వ్యూహం బెడిసికొట్టింది: ధావన్

PBKS vs LSG

16813971671019346 India Ipl Cricket 63392

PBKS vs LSG: మొహాలీ వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. పంజాబ్‌ను 52 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది.

పంజాబ్ ఆటగాళ్లు అథర్వ తైడే ,సికందర్ రజా తీవ్రంగా శ్రమించారు. ఈ మ్యాచ్ లో అథర్వ తొలి అర్ధ సెంచరీనమోదు చేశాడు. అదే సమయంలో సికందర్ రజా 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం 50 పరుగులు నెలకొల్పారు. తైడే 66 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలమవడంతో మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ జట్టును 200 దాటికి తీసుకెళ్లారు.

మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ…. మేము అధికంగా పరుగులు ఇచ్చాము. భారీ స్కోర్ లక్ష్యంగా బరిలోకి దిగాము. కాబట్టి సులభం కాలేదు. ఇది వ్యక్తిగతంగా నాకు ఒక పాఠం. ఏదేమైనా జట్టులో అదనపు బౌలర్‌ను చేర్చుకోవాలనే వ్యూహం బెడిసికొట్టింది అని అభిప్రాయపడ్డారు.

శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఇరుజట్లు మొత్తం 458 భారీ స్కోర్ సాధించారు. లక్నో 257 పరుగులతో ఉచకోచ కోసింది. ఐపిఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరుఇది. ఈ సీజన్‌లో మొహాలీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ ఆరో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సి ఉంది.

Read More: Wrestlers Issue: రెజ్లర్ల పట్టుకు దిగొచ్చిన ఢిల్లీ పోలీసులు.. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నట్టు ప్రకటన