Site icon HashtagU Telugu

Shikhar Dhawan Marrying Mithali Raj: శిఖర్‌ ధావన్‌తో మిథాలీ రాజ్‌‌ పెళ్లి ఫిక్స్ అయిందా? గబ్బర్ రియాక్షన్..

Shikhar Dhawan Marrying Mithali Raj

Shikhar Dhawan Marrying Mithali Raj

Shikhar Dhawan Marrying Mithali Raj: 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీ రాజ్ 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించింది. ముఖ్యంగా ఆమె మహిళల క్రికెట్‌కు ఆదరణ పెంచడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే మిథాలీని లేడీ సచిన్‌గా పిలుస్తారు. ఇలా పిలవడం ఆమెకు ఇష్టం లేకున్నా.. క్రికెట్ ప్రేమికులు మాత్రం ఆమెను అలానే గౌరవిస్తారు.

ప్రస్తుతం మిథాలీ వయస్సు 41 ఏళ్ళు. నాలుగు పదుల వయసు దాటినా మిథాలీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. అయితే ఆమె పెళ్లిపై అనేక రూమర్స్ ఇప్పటికే వినిపించాయి. లవ్ ఫెల్యూర్ అయి ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు..కానీ రూమర్స్ పై ఆమె ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. అయితే మిథాలీ . శిఖర్ ధావన్ మధ్య ప్రేమాయణం గురించి వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని నేషనల్ మీడియా కోడైకూసిన్ది. అయినప్పటికి ఈ స్టార్ క్రికెటర్లు రూమర్స్ ని లైట్ తీసుకున్నారే తప్ప స్పందించలేదు.

తాజాగా గబ్బర్ స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.ధావన్‌ కరేంగే షోలో పాల్గొన్న ధావన్ మిథాలితో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా ఇద్దరిపై వస్తున్న వార్తలు తప్పుడు ప్రచారమేనన్నాడు. మిథాలీ రాజ్‌‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేశాడు గబ్బర్. ధావన్ స్టేట్మెంట్ తో మిథాలితో ఎలాంటి రిలేషన్షిప్ లేదని క్లారిటీ రావడంతో ఇకనైనా పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డిసెంబర్ 3, 1982న రాజస్థాన్‌లో జోద్‌పూర్‌లో జన్మించిన మిథాలీ రాజ్ ఫామిలీ హైదరాబాద్‌లో స్థిరపడింది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్… టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసింది..అటు శిఖర్ ధావన్ భార్యతో విడిపోయి సింగిల్ టాగ్ వేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని ధావన్‌ 2012లో వివాహం చేసుకున్నాడు.మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం ధావన్ ఐపీఎల్ లో ఆడుతుండగా..గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక మిథాలీ రాజ్‌ ప్రస్తుతం మహిళా ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తోంది.

Also Read: Kumar Sangakkara: టీమిండియా ప్ర‌ధాన కోచ్‌గా సంగ‌క్క‌ర‌..? అస‌లు విషయం ఇదీ..!