Site icon HashtagU Telugu

Dhanashree Verma: చాహ‌ల్‌తో విడాకులు.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన ధ‌న‌శ్రీ!

Dhanashree Verma

Dhanashree Verma

Dhanashree Verma: ధనశ్రీ వర్మ (Dhanashree Verma) ఇటీవల ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకులు తన తల్లిదండ్రులను ఎంతగా ప్రభావితం చేశాయో వివరించింది. ఆమె చెప్పిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..! ధనశ్రీ మాట్లాడుతూ.. యుజ్వేంద్ర చాహల్‌తో విడాకులు తనకు గందరగోళంగా అనిపించినప్పటికీ, తన తల్లిదండ్రులకు మాత్రం అది మరింత మానసిక ఒత్తిడిని కలిగించిందని చెప్పింది. నెగటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌ను ఆమె కొంతవరకు తట్టుకోగలిగినప్పటికీ, తన తల్లిదండ్రులు దానిని తట్టుకోవడం చాలా కష్టమైందని పేర్కొంది. “ఈ తరం వాళ్లం కాబట్టి మేము నెగటివ్ కామెంట్స్‌ను పట్టించుకోకూడదని తెలుసు. కానీ మా తల్లిదండ్రులకు ఎలా చెప్పగలం? మా తల్లిదండ్రుల స్నేహితులు ఫోన్ చేసి ‘ఏం జరిగింది?’ అని అడిగేవారు. ఈ పరిస్థితి నాకు కూడా బలం కావాల్సిన సమయం, అదే సమయంలో నా తల్లిదండ్రులకు కూడా బలం అవసరం” అని ఆమె గుర్తు చేసుకున్నారు.

సమాజం నుండి ఒత్తిడి

ధనశ్రీ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు సమాజం నుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారని, అది తన తల్లిని తీవ్రంగా బాధించిందని తెలిపారు. బంధువులు, స్నేహితుల నుండి నిరంతర ప్రశ్నల వల్ల కొన్నిసార్లు వారు ఫోన్ కాల్స్ కూడా తీయడం మానేశారని ఆమె అన్నారు. “సమాజం నుండి ఇంత ఒత్తిడి అవసరం లేదు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దానిని వారు ఎలా పరిష్కరించుకోగలరు?” అని ఆమె ప్రశ్నించారు. ఈ సమయంలో ఫోన్ కాల్స్ తీసుకోకుండా ఉండాలని వారికి కచ్చితంగా చెప్పాల్సి వచ్చిందని కూడా ధనశ్రీ అన్నారు.

Also Read: AP : ఏపీలో ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ధైర్యం ఇచ్చిన తల్లిదండ్రులు

ఈ కష్ట సమయంలో తన తల్లిదండ్రులు తనకు అండగా నిలబడి ధైర్యం ఇచ్చారని ధనశ్రీ చెప్పింది. వివాహం నుండి బయటకు రావడం సరైన నిర్ణయమని వారు ప్రతిరోజూ గుర్తు చేశారని ఆమె వెల్లడించారు. “ఆ నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. మీరు మీకంటే శక్తివంతమైన వ్యక్తితో ఉన్నప్పుడు, ఆ బంధం నుండి బయటపడాలని నిర్ణయించుకోవడం చాలా ధైర్యంతో కూడుకున్న పని. నా తల్లిదండ్రులు నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు గర్వపడుతున్నామని నాకు ప్రతిరోజూ చెబుతూనే ఉన్నారు. ఇది అంత సులభం కాదు” అని ఆమె చెప్పారు.

తన వివాహం, విడాకుల గురించి వచ్చిన తప్పుడు పుకార్లు, ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కొన్నారనే విషయంపై ధనశ్రీ మాట్లాడుతూ.. తన ప్రశాంతతను కాపాడుకోవడానికి తాను మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. “మౌనంగా ఉండటం సులభం కాదు. దానికి చాలా బలం కావాలి. అందుకే మనం ‘వ్యక్తిగత జీవితం’ అని అంటాం. అది ప్రైవేట్‌గా ఉండాలి. నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే ఒక చేత్తో చప్పట్లు కొట్టలేరు” అని ఆమె స్పష్టం చేశారు.

Exit mobile version