Yuzvendra Chahal: వినోద పరిశ్రమ, క్రికెట్ ప్రపంచం నుండి మరో విడాకుల వార్త బయటకు వస్తోంది. హార్దిక్ పాండ్యా- నటాషా విడాకుల తరువాత ఇప్పుడు డ్యాన్సర్ ధనశ్రీ వర్మ, ఆమె క్రికెటర్ భర్త యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే యుజువేంద్ర, ధనశ్రీ అభిమానులు షాక్ అయ్యారు.
త్వరలో విడాకులు ప్రకటించనున్నారు
ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్‌లకు సన్నిహితంగా ఉండే వ్యక్తి ప్రకారం.. విడాకుల ప్రక్రియ ఇంకా ఖరారు కానప్పటికీ వారు విడిపోనున్నట్లు ఆయన తెలిపినట్లు ఓ నివేదిక పేర్కొంది. “విడాకులు అనివార్యం, ఇది అధికారికంగా మారడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. వారి విడిపోవడానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. అయితే ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. విడివిడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు’’ అని ఇరువురి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: Rohit Sharma: రిటైర్మెంట్ వార్తలు.. కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే..!
ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో విడిపోయారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇది మాత్రమే కాదు యుజువేంద్ర తన ఖాతా నుండి తన భార్య ధనశ్రీ చిత్రాలను కూడా తొలగించాడు. కానీ ధనశ్రీ ఇంతవరకు ఎలాంటి ప్రతిచర్యకు పూపుకోలేదు. యుజ్వేంద్రతో ఉన్న చిత్రాలన్నీ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అందుబాటులో ఉన్నాయి. ఈ వార్త అభిమానుల్లో కలకలం రేపుతోంది. క్రికెటర్, అతని భార్య డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. వారి వివాహం మీడియాలో చాలా చర్చనీయాంశమైన విషయం కూడా తెలిసిందే. విడాకుల విషయమై చాహల్, ధనశ్రీల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. యుజ్వేంద్ర, ధనశ్రీ డిసెంబర్ 11, 2020న వివాహం చేసుకున్నారు.
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల పుకార్లు చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇ-టైమ్స్ నివేదిక ప్రకారం.. ఇద్దరూ త్వరలో విడిపోబోతున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదని పేర్కొంది.