CSK Beats DC: చెన్నైకి మరో విజయం

ఐపీఎల్ 15వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో విజయాన్ని అందుకుంది.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 11:38 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న ఆ జట్టు తాజాగా ఢిల్లీ పై విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఓపెనర్లు డెవోన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్ మరోసారి కళ్లు చెదిరే ఆరంభం ఇచ్చారు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్ కి 182 రన్స్‌ జోడించిన ఈ ఇద్దరూ.. ఢిల్లీతో మ్యాచ్‌లోనూ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పారు. ముఖ్యంగా కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
27 బాల్స్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. మరోవైపు రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా 33 బాల్స్‌లోనే 41 రన్స్‌ చేశాడు. వీళ్ల జోరుకు 11 ఓవర్లలోనే 110 పరుగులు వచ్చాయి. తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన దూబెతో కలిసి మరింత ధాటిగా ఆడాడు. చివరికి 49 బాల్స్‌లో 87 రన్స్‌ చేసి ఔటయ్యాడు. చివర్లో ధోనీ కూడా మెరుపులు మెరిపించాడు. 8 బాల్స్‌లో 21 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 రన్స్ చేసింది.

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ ఏ దశలోనూ ధాటిగా ఆడలేక పోయింది. రెండో ఓవర్ నుంచే వికెట్లు కోల్పోయింది. వార్నర్ , మిచెల్ మార్ష్ ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేక పోయారు. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 117 ప‌రుగుల‌కే చాప‌చుట్టేసింది. ఫ‌లితంగా సీఎస్‌కే 91 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ 25 రన్స్ తో టాప్ స్కోర‌ర్‌గా నిలువ‌గా.. సీఎస్‌కే బౌల‌ర్లలో మొయిన్ అలీ 3, సిమ్ర‌న్‌జీత్, ముకేశ్ చౌద‌రీ, బ్రావో త‌లో 2 వికెట్లు, తీక్ష‌ణ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టిక లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మరోవైపు కీలక మ్యాచ్ లో ఓడిన ఢిల్లీకి మిగిలిన అన్ని మ్యాచ్ ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది.