NO DRS for CSK: వేలకోట్ల ఐపీఎల్ లో ఇంత దారుణమా..?స్టేడియంలో పవర్ కట్..!

IPL...బీసీసీఐకి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్.

  • Written By:
  • Updated On - May 12, 2022 / 09:12 PM IST

IPL…బీసీసీఐకి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. తాజా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఓ సంఘటన..ఐపీఎల్ పరువును దిగజారేలా చేసింది. ముంబై వాంఖడే స్టేడియంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టాస్ అలస్యం అయ్యింది. ఫ్లడ్ లైట్స్ వెలగకపోవడంతో ఐదు నిమిషాలపాటు ఇరు జట్ల కెప్టెన్స్ ఎదురుచూడాల్సి వచ్చింది. ఐదు నిమిషాల ఆలస్యం పెద్ద విషయం కాదు. కానీ చిన్న ప్రాబ్లమ్స్ తో మ్యాచ్ లు ఆలస్యంగా స్టార్ట్ కావడం కూడా పెద్ద సమస్య కాదు. అయితే స్టేడియంలో విద్యుత్ సరఫరా లేనందున DRSతీసుకునేందుకు అవకాశం లేదంటూ రిఫరీలు తేల్చేశారు.

అయితే ఇది చెన్నై సూపర్ కింగ్స్‌ను ఘోరంగా దెబ్బ తీసింది. డానియల్ వేసిన ఇన్నింగ్ సెకండ్ బాల్ కే డివాన్ కాన్వేని ఎల్బీడబ్లూ అవుట్ గా అంపైర్ ప్రకటించాడు. ఎల్బీడబ్ల్యూల విషయాల్లో చాలాసార్లు అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు, రివ్యూల్లో తారుమారు అయ్యాయి. అయితే DRS తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత రెండో బంతికే వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ ఆలీ డకౌట్ అయ్యాడు. టీవీ రిప్లైలో కాన్వే ఎదుర్కొన్న బంతి, లెగ్ స్టంప్‌ని మిస్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో కీలక మ్యాచ్‌లో సాంకేతిక సమస్య చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌ను కకావికలం చేసింది.

డానియల్ సామ్స్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్‌కి క్యాచ్ ఇవ్వడంతో మొయిన్ అలీ అవుట్ అయ్యాడు. ఫస్ట్ ఓవర్‌లో వైడ్ల రూపంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి 3 పరుగులు వచ్చాయి. 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా వేసిన ఓవర్‌లో రాబిన్ ఊతప్ప ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అప్పటికీ DRS తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఊతప్ప 1 పరుగు చేసి నిరాశగా పెవిలియన్ చేరాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది…ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త ఫ్రాంఛైజీల బిడ్ల ద్వారా రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించిన బీసీసీఐ, మ్యాచుల నిర్వహణ విషయంలో మరీ ఇంత అద్వానంగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది.