Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) మినీ వరల్డ్ కప్ అని కూడా పిలుస్తారు. ఈసారి ఈ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. అయితే ఈ టోర్నీని పాకిస్తాన్ నిర్వహిస్తున్నప్పటికీ టీమిండియా ఆడే మ్యాచులు మాత్రం యుఎఇలో జరుగుతాయి. ఈ టోర్నీ టీమిండియాకు కీలకంగా మారింది.
వరుస ఓటములతో సతమతమవుతున్న రోహిత్ సేన ఈ టోర్నీని కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇక ఈ ట్రోఫీలో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు అనేకసార్లు తమ సత్తాను ప్రదర్శించారు. ఈ టోర్నీలో భారత క్రికెట్ తన ఆధిపత్యాన్ని కొనసాగించిందనడానికి సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల ఈ ఇన్నింగ్స్‌లే నిదర్శనం. మాజీ కెప్టెన్, సౌరవ్ గంగూలీ 2000లో దక్షిణాఫ్రికాతో నైరోబీలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో అజేయంగా 141 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సౌరవ్ గంగూలీ 142 బంతులు ఎదుర్కొన్నాడు. అందులో 11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. గంగూలీ ఆడిన ఈ భారీ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
Also Read: Hardik Pandya: ఐపీఎల్ లో తొలి మ్యాచ్ కి హార్దిక్ దూరం, ఎందుకో తెలుసా..?
1998లో ఢాకాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత వెటరన్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 141 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో సచిన్ 128 బంతులు ఎదుర్కొన్నాడు, సచిన్ ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. మరో స్టార్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ 2002లో ఇంగ్లండ్‌పై 21 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 126 పరుగులు సాధించాడు.