Site icon HashtagU Telugu

Dhyan Chand: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాల్సిందే..

Dhyanchand Bharat Ratna

Dhyanchand Bharat Ratna

Dhyan Chand: భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం బాధాకరం. బీజేపీ మాజీ నేత ఎల్‌కే అద్వానీ ఈ అవార్డును స్వీకరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు కానీ ధ్యాన్‌చంద్‌ పేరు ప్రస్తావన లేదు. దీంతో హాకీ దిగ్గజాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.

ఒలంపిక్ క్రీడలను భారత్‌లో నిర్వహించాలనిప్రభుత్వం ఒకవైపు కోరుతున్నప్పటికీ గొప్ప ఒలింపియన్‌ను సత్కరించేందుకు ఇష్టపడకపోవడం విడ్డూరం. ధ్యాన్‌చంద్‌ తన కృషితో భారత్‌ను ప్రపంచ హాకీలో సూపర్‌పవర్‌గా మార్చాడు. 1936లో బెర్లిన్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో ఆ మ్యాచ్‌ను వీక్షిస్తున్న అడాల్ఫ్ హిట్లర్ ధ్యాన్‌చంద్‌ ఆటతీరును ముగ్దుడయ్యాడు. ఆ మ్యాచ్ లో భారత్ 8-1 స్కోరుతో జర్మనీని ఓడించింది. ధ్యాన్‌చంద్‌ హాకీ ఆడే నైపుణ్యానికి హిట్లర్‌ ఎంతో ముగ్ధుడయ్యాడని చెప్పుకుంటుంటారు.1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ధ్యాన్ చంద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఈ పోటీలో భారత హాకీ జట్టు మొత్తం 38 గోల్స్ చేసి మరో ఒలింపిక్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఆ విధంగా భారత్‌కు ఒలింపిక్స్‌లో వరుసగా మూడు బంగారు పతకాలు లభించాయి.

ధ్యాన్‌చంద్‌ తన కెరీర్‌లో 185 మ్యాచ్‌లు ఆడి 570 గోల్స్ చేశాడు. అది ఒక్కో మ్యాచ్‌కు సగటున 3.08 గోల్స్‌గా ఉంది. దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాళ్లు పీలే, మారడోనా, మెస్సీ మరియు రొనాల్డో కంటే ఆ స్ట్రైక్ రేట్ చాలా మెరుగ్గా ఉంది. అతను మరణించి 45 సంవత్సరాలు గడిచినప్పటికీ, అతనికి ఇప్పటికీ గుర్తింపు దక్కలేదు.అగ్రశ్రేణి హాకీ ఆటగాళ్లు ధ్యాన్‌చంద్‌ను భారతరత్నతో సత్కరించాలని చాలా సంవత్సరాలుగా క్రీడా మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వారి విన్నపాలు బెడిసికొట్టాయి. ఎన్నో ఏళ్లుగా క్రీడా మంత్రిత్వ శాఖను కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది.

Also Read: TS : కృష్ణానదీ జల వనరుల ప్రాజెక్టులపై చర్చ కు మీము సిద్ధం..మీరు సిద్ధమా..? – హరీష్ రావు