Delhi vs Rajasthan: మూడోసారి ఓడిన ఢిల్లీ.. వార్నర్ కష్టం వృధా

ఇండియన్ ప్రీమియర్ మ్యాచ్‌లో ఇవాళ గువాహటిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ - రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడ్డాయి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఓటమి పాలైంది.

  • Written By:
  • Updated On - April 8, 2023 / 10:29 PM IST

Delhi vs Rajasthan IPL T20 2023 : ఇండియన్ ప్రీమియర్ మ్యాచ్‌ లో ఇవాళ గువాహటిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ – రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడ్డాయి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఓటమి పాలైంది. మొదటి మ్యాచ్‌లో గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఢిల్లీపై (Delhi Capitals) ఎలాగైనా గెలవాలని మైదానంలో అడుగుపెట్టింది. అటు మూడో మ్యాచులోనైనా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది ఢిల్లీ. అయితే పోటాపోటీగా బరిలోకి దిగిన ఈ రెండు జట్లలో ఢిల్లీ ముచ్చటగా మూడో సారి ఓటమి పాలైంది.

రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి పంతం నెగ్గించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 200 పరుగుల లక్ష్యాన్నిచ్చింది. అయితే ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులతో సరిపెట్టుకుంది. దీంతో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే కుప్పకూలిపోయింది. యశస్వి జైస్వాల్ మరియు జోస్ బట్లర్ మొదటి వికెట్‌కు కేవలం 8.3 ఓవర్లలో 98 పరుగులు సాధించారు. జైస్వాల్ 31 బంతుల్లో 60 పరుగులు చేయగా, బట్లర్ 51 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ఇలా వీరిద్దరు అర్ధశతకాలు సాధించి భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర వహించారు తర్వాత, షిమ్రాన్ హెట్మెయర్ 21 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2, కుల్దీప్, పోవెల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ 65 పరుగులతో ఒంట‌రి పోరాటం చేసినా జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. అయితే ఈ మ్యాచులో వార్నర్ ఓ ఫీట్ సాధించాడు. ఈ రోజు చేసిన పరుగులతో ఐపీఎల్‌లో 6 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై 40 ర‌న్స్ కొట్టి ఈ ఫీట్ సాధించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (కీపర్), అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.

రాజస్థాన్ రాయల్స్ జట్టు : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

Also Read:  Komati Reddy: అడగకుండా కేంద్ర నిధులు ఎలా ఇస్తుంది: కోమటిరెడ్డి