Delhi Capitals:నాలుగో బెర్త్ ఢిల్లీదా.. బెంగుళూరుదా…?

ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో 6 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా.. ఏయే జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయనే విషయం ఆసక్తి రేపుతోంది.

  • Written By:
  • Updated On - May 17, 2022 / 12:42 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో 6 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా.. ఏయే జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయనే విషయం ఆసక్తి రేపుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడంతో.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ 20 పాయింట్లతో ప్లేఆఫ్ కు చేరగా.. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్ 16 పాయింట్లతో 2,3వ స్థానాల్లో ఉన్నాయి. వీటిలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉన్న నేపథ్యంలో తమ చివరి మ్యాచ్ తో ఎలాంటి సంబంధం లేకుండా ఈ రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్ రేసు నుండి తప్పుకోగా.. నాలుగో బెర్తు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఢిల్లీ జట్టు తన చివరి మ్యాచ్‌లో ముంబైతో పోటీపడనుండగా.. ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ తన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై గెలిస్తే మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా ఆర్సీబీతో సంబంధం లేకుండా ప్లే ఆప్స్ లోకి అడుగుపెడుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలై గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గెలుపొందితే బెంగళూరు జట్టు ప్లే ఆప్స్ కు చేరుతుంది. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్ లో ఓడిపోతే కోల్‌కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లమెరుగైన రన్ రేట్ ఉన్న టీం ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంటుంది.