IPL 2024: పంత్ రెడీ.. ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు – బలహీనతలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. పంత్ పునరాగమనంతో ఢిల్లీ మరింత పటిష్టంగా మారనుంది.

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. పంత్ పునరాగమనంతో ఢిల్లీ మరింత పటిష్టంగా మారనుంది. తద్వారా జట్టులో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ల సంఖ్య మరింత పెరిగింది.

పృథ్వీ షా, పంత్ 145 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌ మైంటైన్ చేస్తారు. అయితే ఈ సీజన్‌లో ఆల్‌రౌండర్లు లేకపోవడం జట్టుకు సమస్యగా మారవచ్చు.గత వేలంలో ఫ్రాంచైజీ 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది, ఇందులో నలుగురు విదేశీయులు మరియు 5 అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు.డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, రికీ భుయ్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అక్షర్ ఫినిషర్ పాత్రను పోషించగలడు కానీ డెత్ ఓవర్లలో అతనికి సపోర్ట్ చేసే బ్యాట్స్‌మెన్ లేకపోవడం జట్టుకు మైనస్ అయ్యే ప్రమాదముంది. పేస్ అటాక్‌లో ఎన్రిక్ నోర్త్యా, ముఖేష్ కుమార్ మరియు ఝే రిచర్డ్‌సన్ ఉన్నారు. గాయం కారణంగా లుంగీ ఎన్‌గిడి టోర్నీకి దూరమయ్యాడు. వీరితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

టాప్ ఆర్డర్‌లో పృథ్వీషా, వార్నర్ మరియు మిచెల్ మార్ష్ ఈ ముగ్గురు విధ్వంసం సృష్టిస్తే ఢిల్లీ స్కోర్ బోర్డుకు డోకా ఉండదు. ఈ త్రి స్టార్ బ్యాట్స్‌మెన్లు చాలా వేగంగా పరుగులు చేయగలరు. ముగ్గురి స్ట్రైక్ రేట్ దాదాపు 140గా ఉంది.మిడిలార్డర్‌లో పంత్‌ చూసుకుంటాడు: పంత్‌ రాకతో ఢిల్లీ మిడిలార్డర్‌ మరింత బలపడింది. అక్షర్ పటేల్ కుమార్ కుషాగ్రా మరియు ట్రిస్టన్ స్టబ్స్‌తో ఫినిషింగ్ పాత్ర పోషిస్తాడు. బౌలింగ్ దళం చూసుకున్నట్లైతే పేస్ అటాక్‌లో విదేశీ మరియు భారత బౌలర్లు రాణిస్తున్నారు. ఎన్రిక్ నోర్త్యా మరియు ఝే రిచర్డ్‌సన్ ఢిల్లీ పేస్ అటాక్‌ను బలోపేతం చేస్తున్నారు. డెత్ ఓవర్లలో ఇద్దరూ ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలరు . వీరితో పాటు ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ కూడా సహకారం అందించగలరు.

ఢిల్లీ బలహీనతలు చూసుకున్నట్లైతే జట్టుకు సరైన ఫినిషర్ లేకపోవడం: రోవ్‌మన్ పావెల్‌ను విడుదల చేసిన తర్వాత ఢిల్లీకి ఫినిషర్ కొరత ఏర్పడింది. హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీ ఆడడం లేదు. ఈ పరిస్థితిలో అక్సర్‌తో పాటు మ్యాచ్ పూర్తి చేసే బాధ్యత అనుభవం లేని స్టబ్స్ మరియు ఫ్రేజర్-మగార్క్‌లపై పడింది. జట్టులో పెద్దగా ఆల్ రౌండర్లు లేకపోవడం జట్టుకు మైనస్ అవ్వొచ్చు. మిచెల్ మార్ష్ మరియు అక్షర్ మాత్రమే ఢిల్లీలో అనుభవజ్ఞులైన ఆల్ రౌండర్లున్నారు, కాబట్టి జట్టు స్పెషలిస్ట్ ప్లేయర్‌లపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. లలిత్ కుమార్, సుమిత్ కుమార్ వంటి ఆల్ రౌండర్లు కూడా జట్టులో ఉన్నప్పటికీ ఇద్దరిపై ఆధారపడలేం. స్పిన్ విషయానికి వస్తే.. జట్టులో కుల్దీప్ మరియు అక్షర్ రూపంలో కేవలం ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరు గాయపడినా జట్టు కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: Lok Sabha Elections 2024: 60 వేల మంది పోలీసుల నీడలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు