DC Vs PBKS: పంజాబ్ పై..ఢిల్లీ గ్రాండ్ విక్టరీ…ప్లే ఆఫ్ ఆశలు పదిలమే…!!

ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్ రేసులో అత్యంత ముఖ్యమైన మ్యాచ్ పంజాబ్ కింగ్స్ -ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సోమవారం జరిగింది.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 01:15 AM IST

ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్ రేసులో అత్యంత ముఖ్యమైన మ్యాచ్ పంజాబ్ కింగ్స్ -ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సోమవారం జరిగింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సీజన్ ఇది 64వ మ్యాచ్. పంజాబ్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ పంజాబ్ కింగ్స్ ను 17 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో తమ ఏడవ విజయాన్ని ఢిల్లీ నమోదు చేసింది. కుల్దిప్ యాదవ్, అక్టర్ పటేల్ స్పిన్ దాడికి పంజాబ్ బ్యాట్ మెన్ కు చుక్కలు చూపించాయి. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 142 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్ 2022లో ఢిల్లీ వరుసగా రెండు మ్యాచుల్లో గెలుపొందడం ఇదే మొదటిసారి.

పంజాబ్ బౌలింగ్ లో రాణించడంతో…ఢిల్లీ తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే పంజాబ్ తన బ్యాటింగ్ లో మాత్రం హోరంగా విఫలమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన చివరి మ్యాచ్ లో 210 పరుగులు చేసిన పంజాబ్ బ్యాట్స్ మెన్ ఈ మ్యాచ్ లో రాణించలేకపోయారు. వరుస వికెట్లు కోల్పోతూ…స్కోరును చేయలేకపోయార. పంజాబ్ బ్యాట్స్ మెన్ ఆవేశంతో భారీ షాట్స్ కు ప్రయత్నిస్తూ వికెట్లను కోల్పోయారు. పవర్ ప్లే చివరి ఓవర్ లో శార్దూల్ ఠాకూర్ , శిఖర్ ధావన్, భానుకా రాజపక్సేలను పెవిలియన్ కు పంపించాడు.

మూడు బాల్స్ తర్వాత కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎనిమిదో ఓవర్లో పంజాబ్ కు అతిపెద్ద దెబ్బ తగిలినట్లయింది. లియామ్ లివింగ్ స్టన్ కుల్దీప్ యాదవ్ వేసిన బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ సఫలం కాలేదు. ఇక్కడి నుంచే పంజాబ్ ఆశలన్నీ నీరుగారాయి. జితేష్ శర్మ చివర్లో రాణించి…రాహుల్ చాహర్ తో కలిసి 8వికేట్ కు 41 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నాడు. కానీ 18 వ ఓవర్ లో శార్దూల్ మళ్లీ జితేష్ తో సహా రెండు వికెట్లు తీశాడు. శార్ధూల్ ఠాకూర్ 4 వికెట్లు తీయగా…అక్షర్ , కుల్దీప్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. మొత్తంగా ఢిల్లీ 159 పరుగులు చేసింది.