Delhi Capitals Must Win: సన్ రైజర్స్ గెలుపు బాట పట్టేనా ?

ఐపీఎల్‌-2022లో మరో ఉత్కంఠభరిత పోరకు రంగం సిద్దమైంది.

  • Written By:
  • Publish Date - May 5, 2022 / 10:04 AM IST

ఐపీఎల్‌-2022లో మరో ఉత్కంఠభరిత పోరకు రంగం సిద్దమైంది. ముంబైలోని బ్రబోర్న్ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇక రెండు వరుస ఓటములతో డీలా పడ్డ సన్ రైజర్స్ జట్టు.. ఢిల్లీపై విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ అభిషేక్ శర్మ , కేన్ విలియంసన్రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరం ,
ఐడెన్ మార్క్రామ్ వంటి స్టార్‌ ఆటగాళ్లు బ్యాట్‌ ఝుళిపిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు. ఇక బౌలిం‍గ్‌ పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పటిష్టంగా కన్పిస్తోంది. బౌలిం‍గ్‌ విభాగంలో ఉమ్రాన్ మాలిక్ , నటరాజన్ , భవనేశ్వర్ కుమార్ వంటి స్టార్‌ బౌలర్లు ఉన్నారు.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా ఢిల్లీ పటిష్టంగా కన్పిస్తునప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు కలసికట్టుగా రాణించలేకపోతున్నారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా తేలిపోయారు. అయితే మిడిలార్డర్‌లో మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ , లోయరార్డర్ లో పావెల్, అక్షర్ పటేల్ రాణిస్తోన్నారు. ఇక ఇరు జట్లలో విధ్వంసక హిట్టర్లు ఉన్నారు కాబట్టి భారీ స్కోర్‌లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు 20 సార్లు ముఖాముఖి తలపడగా.. సన్ రైజర్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది.

ఇక ఈ మ్యాచ్ జరగనున్న బ్రబౌర్న్ పిచ్ ప‌రిస్థితి విషయానికొస్తే.. ఈ పిచ్ అటు బ్యాటర్లకు ఇటు బౌలర్లకు సమానంగా అనుకులిస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. తేమ కూడా కీలక పాత్ర పోషించనుంది. కాగా ఇరు జ‌ట్ల తాజా ఫామ్‌ను బ‌ట్టి చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ తో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకే విజ‌యావ‌కాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.