Site icon HashtagU Telugu

LSG vs DC: లక్నోకు ఢిల్లీ షాక్… రెండో విజయం అందుకున్న క్యాపిటల్స్

LSG vs DC

LSG vs DC

LSG vs DC: ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 17వ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైయింట్స్ కు షాక్ ఇచ్చింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది.ఒక దశలో 94 రన్స్ కే 7 వికెట్లు కోల్పోయిన లక్నో ఈ స్కోర్ చేయడానికి ఆయుష్ బదౌని అద్భుత ఇన్నింగ్స్ కారణం. ఆయుష్ బదోని కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు , 4 సిక్సర్లతో 55 రన్స్ చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో నిలిచిన జట్టును ఒంటి చేత్తో ఆదుకున్నాడు. ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీయగా… అనంతరం బంతి అందుకున్న కుల్‌దీప్ లక్నోకు చుక్కలు చూపించాడు. తొలి తొమ్మిది బంతుల్లోనే మూడు వికెట్లు పడగొట్టి లక్నోని దెబ్బ తీసాడు. అయితే ఢిల్లీ బౌలర్లు మరోసారి డెత్‌ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేయలేకపోయారు.

We’re now on WhatsAppClick to Join

ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగానే ఆడింది. వార్నర్ ఔట్ అయినా…పృథ్వి షా 22 బంతుల్లో 32 రన్స్ చేశాడు. పవర్ ప్లేలో ఢిల్లీ 62 రన్స్ చేయగా…ఆ తర్వాత జాక్ ఫ్రేజర్, రిషబ్ పంత్ కీలక పార్టనర్ షిప్ తో మ్యాచ్ వన్ సైడ్ గా మారింది. దూకుడుగా ఆడిన ఫ్రేజర్ 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు , 5 సిక్సర్లు ఉన్నాయి. కృనాల్ పాండ్య వేసిన ఓవర్లో మూడు సిక్సర్లతో చెలరేగాడు. పంత్ కూడా 24 బంతుల్లో 41 రన్స్ చేయగా ఢిల్లీ విజయం ఖాయమైంది. చివర్లో పంత్ , ఫ్రేజర్ ఔట్ అయినా సాధించాల్సిన రన్ రేట్ పెద్దగా లేకపోవడంతో ఢిల్లీ 18.1 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది రెండో విజయం కాగా లక్నో టీమ్ కి రెండో ఓటమి.

Also Read: AP Elections 2024: ఏపీలో గెలిచేది ఎవరు? కేటీఆర్ ఆన్సర్ ఇదే..