Jemimah Rodrigues: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను తమ కొత్త కెప్టెన్‌గా నియమించింది. మెగ్ లానింగ్ వారసురాలిగా జెమీమా ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్ స్థానంలో జెమీమా రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. లానింగ్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ గత మూడు సీజన్లలోనూ ఫైనల్‌కు చేరినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్‌ను గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం నాయకత్వ మార్పుకు శ్రీకారం చుట్టింది.
ఢిల్లీ జట్టులో జెమీమా ప్రస్థానం
WPL మొదటి సీజన్ నుండి జెమీమా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనే ఉన్నారు. ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో 139.67 స్ట్రైక్ రేట్‌తో 507 పరుగులు చేశారు. ఢిల్లీ ఆడిన మూడు ఫైనల్ మ్యాచ్‌లలోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు.
వరల్డ్ కప్ హీరో.. భారీ ధరతో రిటెన్షన్
25 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టు 2025 ప్రపంచకప్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో ఆమె ఆడిన 127 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ ప్రతిభను గుర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్, WPL 2026 మెగా వేలానికి ముందే ఆమెను రూ. 2.2 కోట్లకు రిటెన్షన్ చేసుకుంది.
కెప్టెన్సీపై జెమీమా స్పందన
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా నియమితులవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన టీమ్ మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు. ఈ ఏడాది మా కుటుంబానికి చాలా బాగుంది. మొదట వరల్డ్ కప్ గెలవడం, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
Also Read: ప్రవైట్ హాస్పటల్ ICU ఛార్జీల బాదుడు పై కేంద్రం ఆగ్రహం
She never lost faith, she never feared and she’s just getting started 💙❤️ pic.twitter.com/UPCuHKbPEs
— Delhi Capitals (@DelhiCapitals) December 23, 2025
అపారమైన అనుభవం
కేవలం 25 ఏళ్ల వయసులోనే జెమీమా టీ20ల్లో గొప్ప అనుభవాన్ని సంపాదించారు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో మొత్తం 113 మ్యాచ్‌ల్లో 14 అర్ధ సెంచరీలతో 2,444 పరుగులు సాధించింది. 59 వన్డే మ్యాచ్‌ల్లో 1,749 పరుగులు చేసింది.
తొలి మ్యాచ్ ఎప్పుడు?
WPL 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను జనవరి 10న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. కొత్త కెప్టెన్ నాయకత్వంలో ఢిల్లీ ఈసారి ఎలా రాణిస్తుందో చూడాలి.
