Site icon HashtagU Telugu

world cup 2023: ఆస్ట్రేలియాకు గిల్ తాత ఛాలెంజ్

Shubman Gill Grandfather Reaction

Shubman Gill Grandfather Reaction

world cup 2023: 2003 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి ప్రతీకారంగా నిన్నజరిగిన మ్యాచ్ లో టీమిండియా గెలవాలని ఆశపడినప్పటికీ నిరాశ మిగిలింది. వరుసగా పది మ్యాచుల్లో గెలిచి ఫైనల్ చేరిన భారత్ టైటిల్ మ్యాచ్ లో నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన పరుగులు రాబట్టలేకపోయింది. రోహిత్ ఆరంభంలో మెరుపులు మెరిపించి స్కోరును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ లో గిల్ కుదురుకునేలోపే క్యాచ్ అవుట్ తో పెవిలియన్ చేరాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో పరుగుల వరద పారించిన గిల్ ఫైనల్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. పైగా సొంత స్టేడియంలో గిల్ రాణిస్తాడనుకుంటుకుంటే అంచనాలను తలక్రిందులు చేశాడు. దీంతో ఆసీస్ చేతిలో 2003 వరల్డ్ కప్ ఫైనల్‌ ఫలితమే ఇప్పుడు కూడా పునరావృతం అయింది. అప్పుడు రికీ పాంటింగ్ ఫైనల్ మ్యాచ్ హీరోగా నిలవగా, ఇప్పుడు ఆ స్థానాన్ని ట్రావిస్ హెడ్ తీసుకున్నాడు.ట్రావిస్ హెడ్ అద్భుత బ్యాటింగ్‌తోపాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా : ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత కంగారూ జట్టుకు శుభ్‌మాన్ గిల్ తాత ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. భారత జట్టుపై చాలా అంచనాలు ఉన్నాయని గిల్ తాత చెప్పాడు. కొన్ని లోపాలున్నాయని వాటిని సరిదిద్దుతామన్నారు. భవిష్యత్తులో కంగారూ జట్టుపై త్వరలో ప్రతీకారం తీర్చుకుంటాం, ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగిందంటూ ఆసీస్ జట్టుకు సవాల్ విసిరాడు. ఫైనల్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. గిల్ అవుట్ తర్వాత 48 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా 4 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ ప్రపంచకప్ లో శుభ్‌మన్ గిల్ 9 మ్యాచ్‌ల్లో 354 పరుగులు చేశాడు.

Also Read: TS Polls 2023 : కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలు – హరీష్ రావు