Site icon HashtagU Telugu

India Beat UAE:భారత మహిళల క్రికెట్ టీమ్ హ్యాట్రిక్ విజయం

Indian Women

Indian Women

మహిళల ఆసియాకప్‌ క్రికెట్ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా శ్రీలంక, మలేషియా జట్లపై గెలిచిన భారత్ తాజాగా మూడో విజయాన్ని అందుకుంది. యూఏఈ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీప్తీ శర్మ 49 బంతుల్లో 64, రోడ్రిగ్స్ 45 బంతుల్లో 75 అర్ధ సెంచరీలతో రాణించారు. యూఏఈ బౌలర్లలో గౌర్‌, మొఘల్‌, కోట్టి, ఇషా రోహిత్‌ తలా వికెట్‌ సాధించారు. తర్వాత 179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 74 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రాజేశ్వరి 2 వికెట్లు, దయాలన్‌ హేమలత ఒక్క వికెట్‌ పడగొట్టింది భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో అక్టోబర్‌7న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.