Site icon HashtagU Telugu

Deepika Padukone: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌ ట్రోఫీని ఆవిష్కరించనున్న బాలీవుడ్ బ్యూటీ..?

Deepika Padukone

Wallpapersden.com Deepika Padukone In Beautiful Green Dress Wallpaper 1280x720 11zon

FIFA వరల్డ్ కప్ 2022 ఖతార్‌లో హోరాహోరీగా సాగుతోంది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 18న జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌లో దీపికా పదుకొణెకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఫైనల్ మ్యాచ్ ట్రోఫీని దీపికా పదుకొణె ఆవిష్కరించనుంది. FIFA వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ ట్రోఫీని ఆవిష్కరించడానికి ఎంపికైన మొదటి గ్లోబల్ స్టార్‌గా దీపికా పదుకొణే నిలిచింది.

దీపికా పదుకొణె ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దీపికా పదుకొణె హాలీవుడ్ సినిమాల్లో కూడా పని చేసింది ఇప్పుడు FIFA వరల్డ్ కప్ 2022లో ఫైనల్ మ్యాచ్ కోసం దీపిక ఖతార్ చేరుకోనుంది. ఇక్కడికి చేరుకోవడంతో పాటు ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని దీపిక ఆవిష్కరించనుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే మీడియా కథనాల ప్రకారం.. దీపిక పేరు దాదాపు ఫిక్స్ అయిందట. దీపికా డిసెంబర్ 18 లోపు ఖతార్ వెళ్లనుంది. ఇటీవలి ఫిఫా మ్యాచ్‌కు ముందు నోరా ఫతేహి కూడా ఇక్కడ ప్రదర్శన ఇచ్చింది.

దీపికా పదుకొణె ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయింది. హాలీవుడ్‌లో సినిమాలు చేసిన తర్వాత దీపికా పదుకొణె తన వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. తాజాగా దీపికా పదుకొణె కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ మెంబర్‌గా ఎంపికైంది. దీంతో పాటు గోల్డ్ బ్యూటీ రేషియోలో ప్రపంచంలోని 10 మంది అందమైన హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె పేరు వచ్చింది. ఇప్పుడు FIFA వరల్డ్ కప్ 2022 ఫైనల్ ట్రోఫీని దీపికా ఆవిష్కరించనుంది.