LSG vs MI: దీపక్ హుడా ఫెయిల్యూర్ సీజన్

టీమ్ ఇండియా భవిష్యత్తుగా భావించే దీపక్ హుడా ఐపీఎల్ 2023లో పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా సత్తా చాటలేకపోయాడు

Published By: HashtagU Telugu Desk
LSG vs MI

16 05 2023 Deepak Hooda 23414279

LSG vs MI: టీమ్ ఇండియా భవిష్యత్తుగా భావించే దీపక్ హుడా ఐపీఎల్ 2023లో పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా సత్తా చాటలేకపోయాడు. సాధారణంగా మిడిల్ ఆర్డర్‌లో ఆడే దీపక్‌ను ఈ రోజు ఓపెనర్‌గా దించింది ఆ జట్టు. అయితే మారిన బ్యాటింగ్ స్థానం కూడా అతని ఫామ్‌ను మార్చలేకపోయింది.

ఐపీఎల్ గత సీజన్‌లో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసిన దీపక్ హుడాకు ఈ ఏడాది అస్సలు కలిసి రావడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో దీపక్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో మొత్తం 64 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించడంలో పేరుగాంచిన దీపక్ ఈ సీజన్‌లో కేవలం మూడు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే బాదగలిగాడు. IPL 2023లో లక్నో బ్యాట్స్‌మెన్ సగటు కేవలం 7.11 అయితే అతని స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువ.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్‌ను ఓపెనర్‌గా మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే దీపక్ మరోసారి జట్టు అంచనాలను అందుకోలేక 7 బంతులు ఎదుర్కొని 5 పరుగులకే ఔటయ్యాడు. ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో లక్నో సూపర్ జెయింట్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు లక్నో 12 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలుపొందగా, 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. లక్నో తమ చివరి మ్యాచ్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడాల్సి ఉంది.

Read More: Husband-Wife: భర్తలకు భార్యలు అస్సలు చెప్పకుండా దాచిపెట్టే విషయాలు ఇవేనట!

  Last Updated: 16 May 2023, 09:35 PM IST